తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
హైదరాబాద్ : తెలంగాణలో పదవ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. సచివాలయంలోని డి బ్లాక్ కాన్ఫరెన్స్ హాలులో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 84.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. అయితే ఫలితాలలో ఈసారి కూడా విద్యార్థినులే పైచేయిగా నిలిచారు. బాలికలు 85.37 శాతం, బాలురు 82.95 శాతం ఉత్తీర్ణత సాధించారు.
కాగా టెన్త్ ఫలితాలలో జగిత్యాల జిల్లా 97.35 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, వనపర్తి జిల్లా 64.84 శాతంతో చివరిస్థానంలో నిలిచింది. అలాగే 2005 స్కూళ్లలో వందశాతం ఫలితాలు వచ్చాయి. జూన్ 5వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 14 నుంచి 30వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో తెలుగు మీడియం నుంచి 48 శాతం మంది, ఇంగ్లిష్ మీడియం నుంచి 52 శాతం మంది ఉన్నారు.
ఈ వెబ్‌సైట్‌లలో ఫలితాలను పొందవచ్చు
www. sakshi. com
www. sakshieducation. com
www. bsetelangana. org
http:// results. cgg. gov.in