మందమర్రి : పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 25వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్ని పరీక్ష పత్రాలో తెలియకుండా.. పూర్తికాని సిలబస్.. సబ్జెక్ట్ కొరత నేపథ్యంలో విడుదలైన పరీక్షల షెడ్యూల్‌తో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షలు ఎలా రాసేదని మదనపడుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 417 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటికి అదనంగా ఏడు మోడల్ హై స్కూల్స్ పని చేస్తున్నాయి. ఆయా ఉన్నత పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్న వారున్నారు. 37 వేల మంది రె గ్యులర్ విద్యార్థులు పదో తరగతి చదువుతుం డగా మరో ఎనిమిది వేల మంది ప్రైవేట్ వారున్నారు. వీరంతా మార్చి నెలలో జరిగే పబ్లిక్ ప రీక్షలకు హాజరు కావాల్సి ఉంది. వాస్తవానికి డి సెంబర్ నెలాఖరులోగా అన్ని సబ్జెక్టుల్లో సిలబ స్ పూర్తి కావాల్సి ఉంది. జనవరి నుంచి రివిజన్ తరగతులు బోధించాలి. కానీ.. కొత్త పాఠ్యాంశాలతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
70 హైస్కూళ్లలో అయోమయం...
జిల్లాలోని మొత్తం 424 ఉన్నత పాఠశాలల్లో చాలా వాటిలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ము ఖ్యంగా గణితం, ఇంగ్లిష్, సామాన్యశాస్త్రం బో ధించే ఉపాధ్యాయులు లేరు. దాదాపు 70 నుం చి 80 ఉన్నత పాఠశాలల్లో ఈ సమస్య ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాల సమాచారాన్ని బట్టి తె లుస్తోంది. కేవలం సబ్జెక్టు టీచర్లు ఉన్నచోటే సి లబస్ పూర్తి కావొచ్చే దశలో ఉంది. వీరు లేనిచో ట పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్ప టికే ఆరు నెలల బోధన సమయం గడిచిపోయింది. మొన్నటి వరకు కామన్ కాంప్రినెన్స్ ఎ వాలేషన్(సీసీఈ)పై సమగ్ర శిక్షణ, స్పష్టత లే కుండా పోయింది. దేనికి ఎన్ని మార్కులు వే యాలన్నదీ తెలియని పరిస్థితి. ఎలాంటి క్లారిటీ లేక ఇటు సిలబస్ పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు సైతం సతమతమవుతున్నారు.
తుస్సుమన్న జీవో 6..
రాష్ట్రంతోపాటు జిల్లాలోనూ ఉపాధ్యాయుల రేషనలైజేషన్ చేపట్టాల్సి ఉంది. ఇందుకు జీవో నంబర్ 6ను ప్రభుత్వం విడుదల చేసింది. కా నీ.. ఎక్కడా రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టింది లేదు. పర్యావసానంగా పిల్లలున్న చోట ఉపాధ్యాయులు లేరు.. ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు లేరు. జీవో అమలు కాకపోయినా కనీసం స్కూల్ అసిస్టెంట్ల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టలేకపోయింది. పైగా అకాడమిక్ ఇన్‌స్పెక్టర్ల(ఏఐ)ను ఇస్తామన్న ప్రభుత్వం వారి ఊసే ఎత్తలేదు. అసలే పుస్తకాలు మారాయి.
మారిన పుస్తకాలపై ఉపాధ్యాయులకు కనీసం శిక్షణ కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు. ఏదో మొక్కుబడిగా నవంబర్ నెలలో నామమాత్రపు శిక్షణ ఇచ్చారు. మరోవైపు ఏఐల నియామకం లేదు. దీనికితోడు గతంలో మాదిరి విద్యవాలంటీర్ల నియామకాన్ని చేపట్టే వీలే లేకుండా పోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీవీలను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు లేదని ఉన్నతాధికారులు చెప్పారు. దీంతో 10వ తరగతి విద్యార్థుల పరిస్థితి ఎటూ పాలుపోని విధంగా మారింది.
ప్రశ్నాపత్రాలపై గందరగోళం..
అసలే టీచర్ల కొరతతో సిలబస్ పూర్తికాక విద్యార్థులు తంటాలు పడుతుంటే మరోవైపు ప్రశ్నాపత్రాలపై గందరగోళం నెలకొంది. గతంలో 11 ప్రశ్నాపత్రాలు ఉన్న సంగతి తెలిసిందే. 11 పేపర్లు కాకుండా ఏడు పేపర్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం తొమ్మిది పేపర్లకు నిర్ణయం మార్చుకుంది. ఇలా 15 రో జులకోమారు 9, 7, 11 పేపర్లు అంటూ ప్రకట నలు చేస్తుండడం విద్యార్థులను గందరగోళానికి దారితీసింది. ఎట్టకేలకు 11 పేపర్లు అన్నది స్పష్టం అయినా నేడు సిలబస్ సమస్యగా పరిణమించింది.
ప్రాజెక్టు మార్కులెలా వేసేది..?
పదో తరగతి పరీక్షలు అటు విద్యార్థులతోపా టు ఇటు ఉపాధ్యాయులకు సైతం ప్రహసనం గా మారాయి. ప్రధానంగా ప్రాజెక్టు మార్కులు ఎలా వేసేదని వారు తలలు పట్టుకుంటున్నా రు. కొత్తగా చేపట్టిన విధానంతో ప్రతి సబ్జెక్టుకు ప్రాజెక్టు మార్కులను ఉన్నతాధికారులు రూ పొందించారు. ఒక్కో సబ్జెక్టుకు 20 మార్కులు ఉపాధ్యాయులే వేయాల్సి ఉంటుంది. అంటే సబ్జెక్టు వారిగా ప్రాజెక్టు పని పూర్తి చేసిన విద్యార్థులకు సదరు మార్కులు వేయాలి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జిల్లాలోని చాలా ఉన్నత పాఠశాలల్లో ప్రాజెక్టులు తయారు చేసేందుకు అనుకూ ల వాతావరణం లేదు. ముఖ్యంగా సైన్స్ సబ్జె క్టు విషయానికొస్తే ల్యాబ్ తప్పనిసరి. ఈ సౌకర్యం పాత ఉన్నత పాఠశాలల్లో తప్ప మరెక్కడా లేదు. కేవలం 20 శాతం ఉన్నత పాఠశాలలకే ల్యాబ్‌లు ఉన్నాయి. ప్రాజెక్టు ఇచ్చినా, వాటి పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించిన వారు లేరు. ఈ తరుణంలో 20 మార్కులు ఎలా వేసేదని ఉపాధ్యాయులే జుట్టు పీక్కుంటున్నారు.
జనవరి వరకు పూర్తి చేయొచ్చు...
- కె.సత్యనారాయణరెడ్డి, డీఈవో, ఆదిలాబాద్
పదో తరగతి విద్యార్థులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదు. జనవరి 30వ తేదీ వరకు సిలబస్ పూర్తిచేయొచ్చు. సబ్జెక్టు టీచర్లు లేని మాట వాస్తవమే. దీన్ని అధిగమించేందుకు డి ప్యూటేషన్‌పై కొందరిని నియమిస్తున్నాం. అదేవిధంగా బీఈడీ పూర్తి చేసి ఉన్న వారితో బోధిం చేందుకు చర్యలు తీసుకుంటున్నం.ప్రాజెక్టులకో సం బాధ లేదు. అన్ని పాఠశాలల్లో మెటీరియల్ ఉంది. ల్యాబ్‌లు ఉండాల్సిన అవసరం లేదు.
పది పరీక్షలు కష్టమే
- టి.ఇన్నారెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు
ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు కష్టమే. ఉపాధ్యాయులు, పిల్లలు సత మతమవుతున్నారు. ప్రాజెక్టు మార్కులు ఎలా వేసేదో తెలియడం లేదు. ప్రాజెక్టు చేయకుండా విద్యార్థిని ఎలా అంచనా వేస్తాం. మార్కులెలా వేస్తాం. ఈ ఏడాదికి ప్రాజెక్టు విధానం తీసేయాలని ఉన్నతాధికారులను కోరాం. పాత పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని సూచించిన ఎవరూ పట్టించుకోవడం లేదు. మొత్తానికి పరీక్షలు ప్రశ్నార్థకంగానే మారాయి.
‘టెన్’షన్..
Published Wed, Dec 10 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM
Advertisement
Advertisement