మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు
- ముందుగా ఓరియంటల్ ఎస్సెస్సీ పరీక్షలు
- 17వ తేదీ నుంచి 30 వరకు ప్రధాన టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది (2017) మార్చి 14వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు విద్యా శాఖ ప్రకటించింది. తొలుత ఓఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభమవుతాయి. 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రధాన టెన్త్ పరీక్షలు జరుగుతారుు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన ఉన్నత స్థారుు సమావేశంలో టైంటేబుల్ ను ఖరారు చేశారు. అనంతరం ప్రభుత్వ పరీక్షల విభాగం టైం టేబుల్‌ను విడుదల చేసింది.
ముందుగా ఓఎస్సెస్సీకి..
పరీక్షల టైంటేబుల్‌లో ఈసారి కొన్ని మార్పులు చేశారు. సాధారణంగా ప్రధాన టెన్‌త పరీక్షలను ముందుగా ప్రారంభించి, చివరలో ఓరియంటల్ ఎస్సెస్సీ భాషా పేపర్లు, వొకేషనల్ ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించేవారు. ఈసారి ఓరియంటల్ ఎస్సెస్సీ భాషా పేపర్లు, వొకేషనల్ ఎస్సెస్సీ పరీక్షలను ముందు నిర్వహించి... తరువాత ప్రధాన టెన్‌త పరీక్షలను నిర్వహించేలా టైంటేబుల్ ఖరారు చేశారు. మార్చి 14 నుంచి 16 వరకు ఓరియంటల్ ఎస్సెస్సీ, ఎస్సెస్సీ వొకేషనల్ కోర్సుల పరీక్షలు నిర్వహించి... 17వ తేదీ నుంచి ప్రధాన టెన్త్ పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ బి. శేషుకుమారి తెలిపారు. ఆబ్జెక్టివ్ పేపర్‌ను పరీక్షలో చివరి అరగంట ముందుగా ఇస్తారని తెలిపారు.