మాట్లాడుతున్న ముస్కు తిరుపతిరెడ్డి
రామడుగు(చొప్పదండి) : ప్రభుత్వం ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎస్సెస్సీ ప్రశ్నాపత్రాల మూల్యాంకనానికి అందజేస్తున్న రెమ్యూనరేషన్ రెట్టింపు చేయాలని పీఆర్‌టీయూ–టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముస్కు తిరుపతిరెడ్డి కోరారు. మండలకేంద్రంలోని ఎమ్మార్సీలో శనివారం జరిగిన పీఆర్‌టీయూ–టీఎస్ మండలశాఖ కార్యవర్గంలో మాట్లాడారు. ప్రభుత్వం జేసీటీయూ ద్వారా చేసుకున్న ఒప్పందం ప్రకారంగా ఉపాధ్యాయుల 34 సమస్యలను ఏప్రిల్ నెలాఖరు వరకు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మేలో ఏకీకృత సర్వీస్‌రూల్స్‌పైన ఉన్న స్టేటస్‌కోను ఎత్తి వేసి బదిలీ, పదోన్నతులు చేపట్టాలని కోరారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి ముజీబ్ అహ్మద్, మండలాధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.మల్లారెడ్డి, నాయకులు దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్, సదాశివ్, చోటేమియా, శ్రీనివాస్, సెలెస్టినా, పి.సత్యనారాయణరెడ్డి, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment