
సాక్షి, హైదరాబాద్: పరిపాలన విభాగాల్లోని వివిధ స్థాయిల్లో అధికారులు అందించిన ఆదర్శప్రాయ సేవలకుగానూ రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ ఎక్స్‌లెన్స్ (టెక్స్) పురస్కారాలు–2018’ప్రకటించింది. సాధారణ, ఆవిష్కరణలు–అమలు, ప్రధాన పథకాల అమలు అనే మూడు విభాగాల్లో వ్యక్తిగతంగా, గ్రూపుగా ఉత్తమ సేవలందించిన అధికారులను ఎంపిక చేసింది. పథకాల రూపకల్పన లేదా పథకాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దిన 13 మంది అధికారులకు పురస్కారాలను అందించాలని ప్రభుత్వానికి సెలక్షన్ కమిటీ సిఫార్సు చేసింది. మరోవైపు పరిపాలనలో అసాధారణ పనితీరు కనబరిచిన మరో ఇద్దరు అధికారుల పేర్లను సెర్చ్ కమిటీ సిఫార్సు చేసింది. సెర్చ్, సెలక్షన్ కమిటీల సిఫార్సుల మేరకు మొత్తం 15 మందికి పురస్కారాలను ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
తెలంగాణ ఎక్స్‌లెన్స్ పురస్కార విజేతలు వీరే..
- పరిపాలనలో అసాధారణ పనితీరు జి.అశోక్ కుమార్, ఐఏఎస్ (ప్రిన్సిపాల్ రెసిడెంట్ కమిషనర్, తెలంగాణ భవన్, ఢిల్లీ) వి.అనీల్ కుమార్, ఐఏఎస్ (కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ)
సాధారణ విభాగం..: వ్యక్తిగత స్థాయి (గౌరవ్ ఉప్పల్, నల్లగొండ జిల్లా కలెక్టర్); గ్రూపు (బుద్ధప్రకాశ్ జ్యోతి, ఐఏఎస్, ఆదిలాబాద్ కలెక్టర్ డి.దివ్య, ఆదిలాబాద్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజీవ్ రాజ్); సంస్థ (బి.జనార్దన్‌రెడ్డి, ఐఏఎస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్)
- ఆవిష్కరణలు...: వ్యక్తిగత (ఆర్వీ కర్ణన్, ఐఏఎస్, మంచిర్యాల జిల్లా కలెక్టర్); సంస్థ (ఎం.దానకిశోర్ ఐఏఎస్, ఎండీ, జల మండలి)
ప్రధాన పథకాలు...
- కేసీఆర్ కిట్..: వ్యక్తిగత (కె.సురేంద్ర మోహన్, ఐఏఎస్, సూర్యాపేట జిల్లా కలెక్టర్); గ్రూపు (సర్ఫరాజ్ అహమ్మద్, ఐఏఎస్, కరీంనగర్ జిల్లా కలెక్టర్, డాక్టర్ రాజేశం, డీఎంహెచ్‌ఓ, డాక్టర్ మహమ్మద్ అలీం, ఎంసీహెచ్ కేంద్రం పాలనాధికారి); సంస్థ (కరుణ వాకాటి, ఐఏఎస్, వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్)
- భూ రికార్డుల ప్రక్షాళన..: గ్రూపు (ఎ.శరత్, ఐఏఎస్, జగిత్యాల జిల్లా కలెక్టర్, గంట నరేందర్, జగిత్యాల ఆర్డీఓ, నలువల వెంకటేశం, మేడిపల్లి తహసీల్దార్); సంస్థ (గౌరవ్ ఉప్పల్, నల్లగొండ జిల్లా కలెక్టర్)
- పరిపాలనలో ప్రత్యేక చొరవ..: వ్యక్తిగత (అలుగు వర్షిణి, ఐఏఎస్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్);
- గొర్రెల పెంపకం..: సంస్థ (ప్రశాంత్ జె పాటిల్, ఐఏఎస్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్)
- ఘన వ్యర్థాల నిర్వహణ..: సంస్థ (డి.క్రిష్ణ భాస్కర్, ఐఏఎస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్)