స్నేహితునితో కలిసి ఈతకు వె ళ్లిన బాలుడు నీట మునిగి మృతిచెందాడు.
స్నేహితునితో కలిసి ఈతకు వె ళ్లిన బాలుడు నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకంది. మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన అభినంద్(12) స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఈక్రమంలో ఈ రోజు ఆదివారం కావడంతో.. స్నేహితునితో కలిసి ఈతకు వెళ్లాడు. మండల శివారులో సింగరేణి సంస్థ వారు నిర్మిస్తున్న పవర్ ప్లాంట్‌లో మొరం కోసం తీసిన గుంటలో భారీగా నీరు చేరింది. దీంతో ఈత కొట్టడానికి అందులోకి దిగాడు. ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు అందులో మునిగి మృతిచెందాడు.