‘ఎల్టా’కు బకారుులుచెల్లించకపోవడమే కారణం
వారంలోగా చెల్లిస్తామనే ఒప్పందంతో ముగిసిన వివాదం
హన్మకొండ అర్బన్ : ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్(ఎల్టా) కు రూ.2.06లక్షలు బకాయిలు చెల్లించని కారణంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం జప్తు చేసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం ఎల్టా ప్రతినిధులు తమ న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కలిసి కలెక్టరేట్‌కు వచ్చి కోర్టు ఆదేశాల పత్రాలను అధికారులకు అప్పగించారు. దీంతో కలెక్టరేట్‌లో కొద్ది సేపు ైెహ డ్రామా నెలకొనగా చివరకు డబ్బు చెల్లించేందుకు అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది.
2006 నాటి ఘటన
జిల్లాలో డీపెప్ ఆధ్వర్యాన 2006సంవత్సరంలో జిల్లా యంత్రాంగం సుమారు 500 మంది ఉపాధ్యాయులకు ఆంగ్ల భాషపై ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. ఇందుకోసం రూ.1.50 లక్షలు ఎల్టాకు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నా శిక్షణ పూర్తయిన తర్వాత డబ్బు చెల్లించలేదు. దీంతో ‘ఎల్టా’ బాధ్యులు జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. వెంటనే డబ్బు చెల్లిం చాలని, లేనిపక్షంలో కలెక్టరేట్ కార్యాలయం జప్తు చేసుకోవాలని(మూవబుల్ ప్రాపర్టీ) తీర్పునిచ్చింది. అరుుతే, ఈ తీర్పుపై అధికారులు స్టే తెచ్చుకోవడంతో పాటు హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లారు. కానీ హైకోర్టు కూడా పిటీషనర్లకు డబ్బు చెల్లించని కారణంగా కలెక్టరేట్ జప్తునకు గతంలో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఎత్తివేయడంతో అవే ఉత్తర్వులు అమలు చేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో ఎల్టా బాధ్యులు జిల్లా కోర్టులో ఎగ్జిక్యూటివ్ పిటీషన్ వేసుకుని గతంలో ఇచ్చిన తీర్పు అమలు చేయాలని కోరారు. ఈ మేరకు కోర్టు ఖర్చులతో కలిపి బాధితులకు బకారుు రూ.1.50లక్షలతో పాటు ఖర్చులు కలిపి రూ.2.06లక్షలు చెలించాలని, లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని జప్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
కోర్టు ఉత్తర్వులు అమల్లో భాగంగా ఫీల్డ్ అధికారి సత్తార్, ఎల్టా తరపున జిల్లాకోర్టులో వాదించిన న్యాయవాది హరిహరరావు బుధవారం కలెక్టరేట్ అధికారులకు ఉత్తర్వుల కాపీలు అందజేశారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు ఎల్టా ప్రతినిధులతో మధ్యవర్తి ద్వారా మాట్లాడి డబ్బులు చెక్కు రూపంలో చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. ఒకటి, రెండు రోజుల్లో తమకు డబ్బులు చెల్లిస్తామని అధికారులు చెప్పారని ఎల్టా గౌరవ అధ్యక్షుడు బత్తిని కొమురయ్య, అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు.
ఇది రెండో సారి..
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆస్తుల జప్తునకు కోర్టు ఆదేశాలు ఇవ్వడం ఇది రెండోసారి. గతంలో ఆత్మకూరు మండలంలో భూ బాదితులకు పరిహారం ఇచ్చే విషయంలో కూడా అధికారుల నిర్లక్ష్యం వహించగా వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో 2009లో కూడా ఇదే విధంగా కోర్టు తీర్పు ఇచ్చింది.
న్యాయం గెలిచింది : కొమురయ్య, శ్రీనివాస్, ఎల్టా బాధ్యులు
మేం ఎల్టా ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. జిల్లా కలెక్టర్, యంత్రాంగంపై మాకు గౌరవం ఉంది. డబ్బు సమస్య కాకున్నా అధికారులు మమ్మల్ని అన్యాయంగా ఇబ్బంది పెడుతూ కోర్టుకు వెళ్లే వరకు పట్టిం చుకోలేదు. మొదటి సారి కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే తెచ్చుకున్నారు. మొత్తానికి హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచిం ది. అధికారులు ఇకనైనా నిర్లక్ష్య ధోరణి వీడి నిబంధనల ప్రకారం నడుచుకోవాలి.
కలెక్టరేట్ జప్తునకు ఆదేశం
Published Fri, Jul 15 2016 1:06 AM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM
Advertisement
Advertisement