ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మల్కాజిగిరి ఏసీపీ రవిచంద్రన్‌రెడ్డి పేర్కొన్నారు...
- మల్కాజిగిరి ఏసీపీ రవిచంద్రన్‌రెడ్డి
ఘట్‌కేసర్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మల్కాజిగిరి ఏసీపీ రవిచంద్రన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కొర్రెములలో మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సైబరాబాద్ పోలీసులు దత్తత తీసుకొనేందుకు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అనంతరం ఆరోగ్య కేంద్రం వద్ద స్వచ్ఛభారత్ నిర్వహించారు.
అక్కడ చెత్తను తొలగించి గుంతల్లో మట్టి పోశారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతామనే ప్రతిజ్ఞ అందరితో ఆయన చేయించారు. కార్యక్రమంలో సీఐ రవీందర్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గ్యార లక్ష్మయ్య, ఎస్‌ఐలు వీరభద్రం, రాజు, బుర్రరాజు,ఏఎస్‌ఐలు ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ బైరగాని నాగరాజ్, ఉపసర్పంచ్ నాగార్జున, మాజీ సర్పంచ్ పసుమాల కృష్ణ, వార్డు సభ్యులు భాస్కర్,నాయకులు తరిణే మహేంద్రాచారి, శ్రీహనుమాన్ రమేష్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మునికుంట్ల సంతోష్ ఇతర యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.