వడ్డీతో కలిపి పెరగనున్న రుణమాఫీ భారం
హైదరాబాద్: గత వ్యవసాయ పంట రుణాల చెల్లింపునకు జూన్ 30తో గడువు ముగిసింది. ఖరీఫ్‌లో కొత్త రుణాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. రుణమాఫీకి కట్టుబడి ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, దీనిపై అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది.
ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనే ఉద్దేశంతో రైతులు రుణాలు చెల్లించలేదు. దీంతో ఈ రుణాలన్నీ ఎగవేత రుణాలు (డీఫాల్ట్)గా మారాయి. సకాలంలో రుణాలు చెల్లిస్తే కేంద్రం వడ్డీ రాయితీ ఇస్తోంది. అయితే రైతులు రుణాలు చెల్లించకపోవడంతో వడ్డీ మొత్తాన్ని రుణమాఫీలో భాగంగా ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితి. దీంతో రుణమాఫీ భారం మరింత పెరగనుంది.
పంట రుణాల చెల్లింపునకు ముగిసిన గడువు
Published Tue, Jul 1 2014 3:08 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement