
పొన్నాల లక్ష్మయ్య
హైదరాబాద్: తెలంగాణ రైతుల ఆత్మహత్యల అంశంలో తొలి ముద్దాయి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావేనని టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. విద్యుత్ సమస్యను పరిష్కరించడంతో విఫలమైన కేసీఆర్, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబును నిందించి లబ్దిపొందాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్ ది అసమర్థ ప్రభుత్వం అని విమర్శించారు.
విద్యుత్ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లకుండా కేసీఆర్ రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ను సమర్ధించిన కోమటిరెడ్డి తీరుని పార్టీలో చర్చిస్తామన్నారు. గాంధీ కుటుంబేతరులు పార్టీ పగ్గాలు చేపట్టవచ్చన్న చిదంబరం వ్యాఖ్యలపై తాను స్పందించనని పొన్నాల చెప్పారు.
**