మోదీ హయాంలోనే దే శాభివృద్ధి
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి
నారాయణపేట రూరల్ : రైతుల కష్టాలను దూరం చే సేందుకు మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికా ర ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపే ట మండలం సింగారంలో పార్టీ ఆధ్వర్యంలో కిసాన్‌సభ ని ర్వహించారు. ముఖ్య అతిధిగా వచ్చిన ఆయన ఈ మేరకు మాట్లాడారు. ప్రధానమంత్రి ఫసల్ యోజన కింద రైతుల కు బీమా వస్తుందని, ఈ పథకంలో 33శాతం నష్టపోయిన పంటకు సైతం నష్టపరిహారం అందుతుందన్నారు.
రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ విధానం అమలు చేస్తున్నారని, దేశవ్యాప్తంగా 245 ఈ మార్కెటింగ్ కేంద్రాలుండగా తెలంగాణలోనే 11 కేంద్రాలను మంజూరు చేసిందన్నారు. రాష్ర్టంలో జరుగుతు న్న అనేక అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి మోదీ ప్రభుత్వం ప్రత్యేక నిధులను విడుదల చేస్తోందని తెలిపారు. మి షన్ కాకతీయ పథకానికి రూ. 500కోట్లు, చెరువుల మరమ్మత్తులకు రూ. 150కోట్లు, మిషన్ భగీరథకు రూ. 1000కోట్లు అందించిందన్నారు. సాయిబన్న, శ్రీనివాసులు, నాగిరెడ్డి, రామకృష్ణ, నర్సింహులు, బాల్‌రెడ్డి, చెన్నప్ప పాల్గొన్నారు.