పార్టీ అభివృద్ధికి కలిసి పనిచేద్దాం | to develop in bjp :-The district in-charge of the BJP Muralidhar Goud | Sakshi
Sakshi News home page

పార్టీ అభివృద్ధికి కలిసి పనిచేద్దాం

Published Sun, Apr 10 2016 2:12 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

పార్టీ అభివృద్ధికి కలిసి పనిచేద్దాం - Sakshi

పార్టీ అభివృద్ధికి కలిసి పనిచేద్దాం

బీజేపీ జిల్లా ఇన్‌చార్జి మురళీధర్‌గౌడ్

 మంచిర్యాల సిటీ :  మంచిర్యాల తూర్పు ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరం కలిసి పనిచేద్దామని ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్జి డాక్టర్ మురళీధర్‌గౌడ్ అన్నారు. శనివారం మంచిర్యాల పట్టణంలో పార్టీ తూర్పు జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో నూతనంగా మంచిర్యాల తూర్పు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ముల్కల్ల మల్లారెడ్డిచే ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని పథకాలను ప్రజల్లోకి చేరవేసే బాధ్యత కార్యకర్తలదేనని అన్నారు.

అనంతరం ముల్కల్ల మల్లారెడ్డి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఇటీవల ఎన్నికైన తూర్పు ప్రాంతంలోని మండల, పట్టణ కమిటీ అధ్యక్షులచే ప్రమాణం చేయించారు. సమావేశంలో నాయకులు గోనె శ్యాంసుందర్‌రావు, మున్నారాజ్ సిసోద్య, తుల అంజనేయులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement