నిశితంగా.. సుదీర్ఘంగా.. | The possibility of long .. .. | Sakshi
Sakshi News home page

నిశితంగా.. సుదీర్ఘంగా..

Published Mon, Mar 30 2015 4:16 AM | Last Updated on Wed, Jul 25 2018 2:52 PM

The possibility of long .. ..

సాక్షి, హన్మకొండ: దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగిరం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు ముందుకు వేస్తున్నారు. జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం, పీవీ.నర్సింహారావు కంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టుల పనుల వివరాలు తెలుసుకున్నారు. మొదటగా ఏరియల్ సర్వే చేస్తారని అధికార యంత్రాంగం ప్రకటించినా.. చివరకు దట్టమైన అటవీ ప్రాంతమైన దేవాదుల ప్రాజెక్టు వద్ద నాలుగు గంటల పాటు అధికారులు, ఆదివాసీ సంఘాలతో సమీక్ష సమావేశాలను నిర్వహించి ఆశ్చర్యపరిచారు.
 
మొదట కంతనపల్లి బ్యారేజీ వద్దకు...
 ఆదివారం ఉదయం 10:30 గంటలకు వరంగల్ నుంచి హెలికాప్టర్‌లో ఏటూరునాగారం ఏజెన్సీకి బయల్దేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట డిప్యూటీ సీఎంకడియం శ్రీహరి హెలికాప్టర్‌లో వెళ్లారు. మొదటగా కం తనపల్లి ప్రాజెక్టు నిర్మాణస్థలికి ఉదయం 10:45 గంట లకు చేరుకున్నారు. ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ప్రాంతా ల్లో ఏరియల్ సర్వే చేసిన తర్వాత 10:51 గంటలకు ము ఖ్యమంత్రి హెలికాప్టర్ నుంచి కిందకు దిగారు. నది ఒడ్డున ఇరిగేషన్ అధికారులు ఏర్పాటు చేసిన షామియానా కిందకు చేరుకున్నారు. అక్కడ కంతనపల్లి ప్రాజెక్టు స్వరూపం, పూర్తి వివరాలతో కూడిన మ్యాపులు పరిశీలించారు.

ఆ తర్వాత ఇరిగేషన్ అధికారులు వెంట రాగా కంతనపల్లి బ్యారేజీ నిర్మాణ పనులు జరుగుతున్న చోటుకు శ్రీహరితో కలిసి కారులో వెళ్లారు. మరో వాహనంలో మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్‌రావు వచ్చారు. గతంలో ప్రారంభించి మధ్యలో ఆగిపోయిన పనుల వివరాలను వారు ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణం భాగంగా జరుగుతున్న సాయిల్ టెస్ట్ పనులు పరిశీలించారు.

ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్న పెద్ద పెద్ద గోతులు ఎందుకంటూ ఈఈ గంగాధర్‌ను సీఎం ప్రశ్నించారు. ఇక్కడ 288 మెగావా ట్ల జలవిద్యుత్ కేంద్ర నిర్మాణం చేపడతామని, ఈ గో తులు దానికి సంబంధించినవేనంటూ వివరించారు. ఎస్‌ఈడబ్ల్యూ, రిత్విక్ కంపెనీలు గతంలో జాయింట్ వెంచర్‌గా చేపట్టిన పలు ప్రాజెక్టుల వివరాలను ఆ కం పెనీ ప్రతినిధులు సీఎంకు వివరించారు. అనంతరం ఏ టూరు  ఇసుక క్వారీ లేబర్ సహకార సంఘానికి సీఎం రూ 1.05 కోట్ల రూపాయల చెక్కును అందించారు.
 
దేవాదుల వద్ద 4 గంటలపాటు సమీక్ష

కంతనపల్లి ప్రాజెక్టు నుంచి హెలికాప్టర్ ద్వారా బయల్దేరిన ముఖ్యమంత్రి ఉదయం 11:55 గంటలకు జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు స్థలానికి చేరుకున్నారు. ఐదు నిమిషాలపాటు గాలిలో హెలికాప్టర్ ద్వారా ప్రాజెక్టు పరిసర ప్రాంతాలపై సర్వే నిర్వహించా రు. అనంతరం దేవాదుల ప్రాజెక్టు వద్ద మధ్యాహ్నం 12:03 గంటలకు సీఎం హెలికాప్టర్ దిగారు. ఇన్‌టేక్‌వెల్‌ను పరిశీలించి మధ్యాహ్నం 12:08 గంటలకు దేవాదు ల పంప్ హౌస్‌కు చేరుకున్నారు. అనంతరం దేవాదుల అతిథి గృహం చేరుకుని మధ్యాహ్నం 12:12 గంటలకు నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఆ తర్వాత కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఆదీవాసీ సంఘాల నాయలకులతో చర్చించారు. చర్చల్లో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టెం ఉపేందర్, తెలంగాణ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొదెం కృష్ణప్రసాద్, ఆదివాసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.బుచ్చయ్య, ఆదివాసీ విద్యార్థి సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బగట్ల సుమన్, ఆదివాసీ ప్రజా సం ఘాల జేఏసీ చైర్మన్ కొమురం నర్సయ్య పాల్గొన్నారు.
 
తోడుగా ముగ్గురు మంత్రులు
సీఎం పర్యటనలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, తన్నీరు హరీశ్‌రావు, పార్లమెంట్ సభ్యులు అజ్మీరా సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్ పాల్గొన్నారు. వీరితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన స్మితాసబర్వాల్, విశ్రాంత సాగునీటి శాఖ ఇంజనీరు విద్యాసాగర్, కలెక్టర్ వాకాటి కరుణ, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ జీవన్, ఎస్పీ అంబర్ కిశోర్‌ఝాతో పాటు ఇతర సాగునీటి శాఖ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
 
అడుగడుగునా పోలీసులే
ఏటూరునాగారం : ఏజెన్సీలోని అడవుల్లో అడుగడుగునా పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి. కంతనపల్లిలో సీఎం పర్యటన నేపథ్యంలో 1500 మంది పోలీసులతో బందోబ స్తు నిర్వహించారు. స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్, కోబ్రా, ఆక్టోపస్ దళాలతో రోడ్లు, అడవుల్లో మారుమూల గ్రామాలు, సమస్యాత్మక ప్రదేశా ల్లో ఐదంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఏ టూరునాగారం నుంచి దేవాదుల వరకు ఉన్న కల్వర్టుల వద్ద వాహనాలను తనిఖీ చేశారు.

అడవుల్లో కూంబింగ్ చేపట్టారు. శనివారం రా త్రి నుంచి పల్లెల్లో పోలీసులు నిఘా ఏర్పా టు చేశారు. గతంలో ఏజెన్సీలో పని చేసిన సీఐ, ఎస్సైలను సమాచార సేకరణకు నియ మిం చారు. బందోబస్తు ఏర్పాట్లను వరంగల్ ఐజీ నవీన్‌చంద్, డీఐజీ మల్లారెడ్డి, ఎస్పీ అం బర్‌కిషోర్‌ఝా, ఓఎస్డీ సన్‌ప్రీత్‌సింగ్ పర్యవేక్షించా రు. మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి వీఐపీలు, మీడియా ప్రతినిధులను తనిఖీ చేశారు. ముం పు గ్రామాల ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతుందని ముందే భావించి మఫ్టీలో మహిళా పోలీసు సిబ్బంది నియమించారు.
 
అటవీ ప్రాంతంలో ఆరు గంటలు
ములుగు :  నక్సల్స్‌కు పెట్టని కోటగా పేరుగాంచిన ఏటూరునాగారం అభయారణ్యంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఏ కధాటిగా ఆరు గంటలకు పైగా గడిపారు. మంత్రులు, నాయకులు ఏజెన్సీలో కాలు పెట్టాలంటేనే వెన్నులో వణుకు పుట్టే ఈ ప్రాంతంలో అధిక సమయం గడిపిన సీఎంగా కేసీఆర్ ముందు వరుసలో నిలిచారు. ఇంతకు ముందు 2008లో దేవాదుల జె చొక్కారావు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీతో కలిసి ఏజెన్సీకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గంటపాటు గడిపారు. ఆయన తర్వాత మళ్లీ సీఎం కేసీఆర్ కంతనపల్లి, దేవాదుల ప్రాజెక్టులను ఏరియల్ సర్వే చేయడానికి ఏజెన్సీకి వచ్చి ఆరు గంటలకు పైగా గడిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement