నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదని హెచ్‌డబ్ల్యూఓలకు కలెక్టర్ హెచ్చరిక
ఒక్కో అధికారి రెండు హాస్టళ్లు దత్తత తీసుకోవాలని కరుణ సూచన
హన్మకొండ అర్బన్/నక్కలగుట్ట : జిల్లాలో ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో హాస్టల్ వెల్ఫేర్ అధికారుల తీరు మారకుంటే కఠిన చర్యలు తప్పవని కల్టెకర్ కరుణ హెచ్చరించారు. అధికారులు ఇప్పటికే రెండు రోజులుగా హాస్టళలో తనిఖీలు చేపట్టారని, మరోసారి తనిఖీలుంటాయని, మార్పు రాకుంటే హెచ్‌డబ్ల్యూఓలను సస్పెండ్ చేయాలని ఆయూ సంక్షేమ శాఖల డిప్యూటీ డెరైక్టర్లను ఆదేశించారు. సోమ, మంగళవారాల్లో అధికారులు సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కలెక్టరేట్‌లో సంబంధిత తనిఖీ అధికారులతో బుధ వారం కలెక్టర్ సమీక్షించారు. 72 అంశాలపై వివరాలు సమర్పించాలని వారికి తనిఖీ రిపోర్టు నమూనా అందజేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న వార్డెన్లు, సిబ్బందిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలో తనిఖీల్లో తేలిన అంశాలను అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనం తరం కరుణ మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లలో మెనూ సక్రమంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కో అధికారి రెండు హాస్టళ్ల చొప్పున దత్తత తీసుకోవాలని, ప్రతి వారంలో రెండు సార్లు ఆ హాస్టళ్లను సందర్శించాలని సూచించారు.
విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంచేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కాగా, కొందరు హెచ్‌డబ్ల్యూఓలు హాస్టళ్లలో అందుబాటులో లేకపోవడం, మరికొం దరు మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తుండడం, రిజిస్టర్లు, విద్యార్థుల సంఖ్య భారీగా తేడా ఉండడం వంటి అంశాలను కరుణ సీరియస్‌గా పరిగణించినట్లు తెలిసింది. ఇందులోభాగంగానే ముందస్తుగా సంక్షేమ శాఖల డిప్యూటీ డెరైక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమా చారం. సమావేశంలో శిక్షణ సహాయ కలెక్టర్ శ్రుతి ఓజా, సంక్షేమ శౠకళ డిప్యూటీ డెరైక్టర్లు కృష్ణవేణి, రమాదేవి, సీఈఓ వెంకటేశ్వర్లు, పీడీ రాము, జేడీఏ రామారావు పాల్గొన్నారు.
ఇంకోసారి మూడిందే..
Published Thu, Jan 22 2015 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM
Advertisement