The suspension
-
వీడని నీడలు
సాంబశివరావుపై వేటు జిల్లా వైద్యాధికారి సస్పెన్షన్ రాష్ట్రస్థాయిలో అక్రమాలే కారణం వరంగల్ : అక్రమాల ఆరోపణలపై జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి పి.సాంబశివరావుపై వేటు పడింది. సర్వీసు నుంచి సస్పెండ్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం కొత్తగా 108 వైద్య సేవల వాహనాలను కొనుగోలు చేయాలని నిర్ణయిం చింది. సాంబశివరావు అప్పట్లో ప్రజారోగ్య శాఖ డెరైక్టర్‌గా ఉన్నారు. 108 వైద్య సేవల వాహనాల కొనుగోలు విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై ప్రాథమిక విచారణ తర్వాత సాంబశివరావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్వల్పకాలంలోనే ఆరోగ్య శాఖలో ఉన్నత స్థాయి పోస్టుకు చేరిన సాంబశివరావు అంతే వేగంగా కిందికి వచ్చారు. ఇప్పడు సర్వీసు నుంచి సస్పెండ్ అయ్యారు. పోస్టు కోసం పోటీ 2011 డిసెంబరులో సాంబశివరావు జిల్లా వైద్య అధికారిగా బాధ్యతలు చేపట్టారు. 2014 జూలై వరకు ఈ పోస్టులో పని చేశారు. 2014 జూన్ 2న రాజయ్య ఉప ముఖ్యమంత్రిగా వైద్య శాఖ బాధ్యతలను చేపట్టడంతో సాంబశివరావు వేగంగా పదోన్నతులు పొందారు. శాఖ పరమైన అక్రమాలపై అప్పటికే పలు ఆరోపణలు ఉన్నా ఆయనకు జూలై 1న ప్రాంతీయ డెరైక్టరు పోస్టు ఇచ్చారు. ఇంతటితో ఆగకుండా జూలై 31న వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర డెరైక్టరుగా పోస్టింగ్ పొందారు. వైద్య, ఆరోగ్య శాఖలో తాత్కాలిక, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ విషయంలోనే ఉన్నతాధికారులపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. వైద్య శాఖ మంత్రిగా ఉన్న తాటికొండ రాజయ్య బర్తరఫ్కు కారణమైన ఆరోపణల విషయంలో సాంబశివరావును ప్రభుత్వం ఆ పోస్టు నుంచి తప్పించింది. జనవరిలో సాంబశివరావు ఆఖరు వారంలో మళ్లీ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర స్థాయిలో ఆరోపణలు ఆయనను వెంటాడుతూనే వచ్చాయి. రాష్ట్ర డెరైక్టరుగా సాంబశివరావు తీసుకున్న నిర్ణయాలపై విచారణలు జరుగుతున్నాయి. 108 సేవల వాహనాల కొనుగోలు అంశంలో ప్రభుత్వం తాజాగా సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంది. సాంబశివరావు సస్పెన్సన్ నేపథ్యంలో ఆయన పోస్టు పలువురు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ జిల్లా శిక్షణ ప్రాజెక్టు అధికారి(పీవోడీటీ) శ్రీరాం, జిల్లా అదనపు వైద్య, ఆరోగ్య అధికారి సాంబశివరావు పేర్లు ఈ పోస్టుకు వినిపిస్తున్నాయి. -
ఇంకోసారి మూడిందే..
నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదని హెచ్‌డబ్ల్యూఓలకు కలెక్టర్ హెచ్చరిక ఒక్కో అధికారి రెండు హాస్టళ్లు దత్తత తీసుకోవాలని కరుణ సూచన హన్మకొండ అర్బన్/నక్కలగుట్ట : జిల్లాలో ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో హాస్టల్ వెల్ఫేర్ అధికారుల తీరు మారకుంటే కఠిన చర్యలు తప్పవని కల్టెకర్ కరుణ హెచ్చరించారు. అధికారులు ఇప్పటికే రెండు రోజులుగా హాస్టళలో తనిఖీలు చేపట్టారని, మరోసారి తనిఖీలుంటాయని, మార్పు రాకుంటే హెచ్డబ్ల్యూఓలను సస్పెండ్ చేయాలని ఆయూ సంక్షేమ శాఖల డిప్యూటీ డెరైక్టర్లను ఆదేశించారు. సోమ, మంగళవారాల్లో అధికారులు సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కలెక్టరేట్లో సంబంధిత తనిఖీ అధికారులతో బుధ వారం కలెక్టర్ సమీక్షించారు. 72 అంశాలపై వివరాలు సమర్పించాలని వారికి తనిఖీ రిపోర్టు నమూనా అందజేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న వార్డెన్లు, సిబ్బందిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలో తనిఖీల్లో తేలిన అంశాలను అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనం తరం కరుణ మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లలో మెనూ సక్రమంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కో అధికారి రెండు హాస్టళ్ల చొప్పున దత్తత తీసుకోవాలని, ప్రతి వారంలో రెండు సార్లు ఆ హాస్టళ్లను సందర్శించాలని సూచించారు. విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంచేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కాగా, కొందరు హెచ్‌డబ్ల్యూఓలు హాస్టళ్లలో అందుబాటులో లేకపోవడం, మరికొం దరు మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తుండడం, రిజిస్టర్లు, విద్యార్థుల సంఖ్య భారీగా తేడా ఉండడం వంటి అంశాలను కరుణ సీరియస్‌గా పరిగణించినట్లు తెలిసింది. ఇందులోభాగంగానే ముందస్తుగా సంక్షేమ శాఖల డిప్యూటీ డెరైక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమా చారం. సమావేశంలో శిక్షణ సహాయ కలెక్టర్ శ్రుతి ఓజా, సంక్షేమ శౠకళ డిప్యూటీ డెరైక్టర్లు కృష్ణవేణి, రమాదేవి, సీఈఓ వెంకటేశ్వర్లు, పీడీ రాము, జేడీఏ రామారావు పాల్గొన్నారు. -
సస్పెన్షన్‌పై తర్జనభర్జన
22 వరకే సాగనున్న అసెంబ్లీలో తమ గళం లేకుండా పోతుందని టీడీపీ ఆందోళన ఇతర పార్టీల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం హైదరాబాద్: శాసనసభలో హల్చల్ చేయడం ద్వారా రెండు రోజులు పతాక శీర్షికలకెక్కిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ప్రస్తుత పరిస్థితి మింగుడు పడడం లేదు. నిజామాబాద్ ఎంపీ కవితపై ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, క్షమాపణ చెప్పిన తరువాతే బడ్జెట్‌పై ప్రసంగించాలని సభా నాయకుడు కేసీఆర్ సహా ఇతర పార్టీల సభ్యులు కూడా చేసిన సూచనను వ్యతిరేకించి పది మంది సభ్యులు వారం రోజులు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఈనెల 21 వరకు సభ్యుల సస్పెన్షన్ కొనసాగుతుంది. కానీ 22తో శాసనసభా సమావేశాలు ముగుస్తున్నాయి. ఈ పరిణామం ఆ పార్టీకి మింగుడు పడడం లేదు. బడ్జెట్‌పై ప్రసంగం సమయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యల కారణంగా ఆపార్టీకి బడ్జెట్‌పై చర్చించే అవకాశమూ రాలేదు. మిగతా ఐదు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే జనం తెలుగుదేశం పార్టీని మరిచిపోతారేమోనన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో మొదలైంది. ఇతర పార్టీల నుంచి మద్దతు : సభ నుంచి టీడీపీ సభ్యులు వారం రోజుల సస్పెన్షన్‌కు గురైన రోజు సీఎల్పీ నేత జానారెడ్డి, బీజేపీ నాయకులు సుతిమెత్తగా ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. అయితే శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్‌రావు మాత్రం రేవంత్ పశ్చాత్తాపం వ్యక్తంచేస్తే తప్ప మెజారిటీ సభ ఒప్పుకోదని కుండబద్ధలు కొట్టారు. తరువాత రెండు రోజులు టీడీపీ మిగతా సభ్యులు ఆర్. కృష్ణయ్య, కృష్ణారావు, బీజేపీ నేత లక్ష్మణ్‌తో పాటు కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క తదితరులు 10 మంది టీడీపీ సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరారు. అయినా ప్రభుత్వం తన పంథాను మార్చుకోలేదు. సోమవారం బీజేపీ, టీడీపీ సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేతనే ఎజెండాగా చేపట్టే అవకాశాలున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. సీఎల్పీ నేత జానారెడ్డితో పాటు సభ్యులు ప్రభుత్వంపై ఒత్తి డితెచ్చేలా వ్యూహం సాగిస్తున్నట్లు సమాచారం.