ఏసీబీకి పట్టుబడిన ఇద్దరు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు
రూ.6 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన వైనం
ఎస్‌ఈ, సూపరింటెండెంట్ ఆస్తులపై సోదాలు
నల్లగొండ క్రైం: ఏసీబీ అధికారులు శుక్రవారం ఇద్దరు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారు లను అరెస్టు చేశారు. నల్లగొండలో ఓ కాం ట్రాక్టర్ వద్ద రూ.6 లక్షలు లంచం తీసుకుం టుండగా గ్రామీణ తాగునీటి పథకం (ఆర్‌డబ్ల్యూఎస్) సూపరింటెండెంట్‌ను, ఇం దుకు ప్రోత్సహించిన ఎస్‌ఈని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నల్లగొండ విజిలెన్స్ విభాగంలో ఎస్పీ స్థాయి అధికారి భాస్కర్‌రావు లంచం తీసుకుంటుం డగా పట్టుబడిన విషయం మరువక ముందే మరో అవినీతి తిమింగలం ఏసీబీకీ చిక్కడం ఉద్యోగులను కలవరానికి గురి చేస్తోంది.
ఇలా చిక్కారు..
హైదరాబాద్ ఎల్‌బీనగర్‌కు చెందిన శాస్త్రీ వివేకానందరెడ్డి పుష్కరాల సమయంలో నల్లగొండ జిల్లా పరిధిలోని ఆర్వో ప్లాంట్లు సహా మొత్తం 39 పనులను చేపట్టాడు. టెండర్ లేకుండా కాంట్రాక్టర్‌కు అప్ప గించడంతో పనులు పూర్తి చేశాడు. 30 పనులకు బిల్లులు చెల్లించగా, మిగిలిన తొమ్మిది పనులకు రూ.30 లక్షల బిల్లులు రావాల్సి వుంది. ఈ బిల్లుల కోసం కాం ట్రాక్టర్ మూడు రోజుల క్రితం సూపరిం టెండెంట్ లక్ష్మారెడ్డిని కలవగా రూ.6 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో వివేకా నందరెడ్డి ఏసీబీ నల్లగొండ డీఎస్పీ కోటేశ్వర్ రావుకు ఫిర్యాదు చేశాడు. మధ్యాహ్నం కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుం డగా అక్కడే కాపుగాసిన ఏసీబీ అధికారులు లక్ష్మారెడ్డిని పట్టుకున్నారు. బిల్లుల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ఎస్‌ఈని హైదరాబాద్‌లో..
లంచం విషయంలో లక్ష్మారెడ్డిని ప్రోత్సహిం చిన ఎస్‌ఈ రమణను ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకొని నల్లగొండకు తీసుకొచ్చారు. ఇద్దరి ఆస్తుల ను తనిఖీ చేస్తామని డీఎస్పీ చెప్పారు.