సిరిసిల్ల రూపురేఖలు మార్చుతా
► రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్లే..
► అమృత్ పథకంలో ప్రత్యేక స్థానం
► రూ. పది కోట్ల వ్యయంతో ఎయిర్‌టెల్ మోడల్ స్కూల్
► నేతన్నలకు ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్ర మంత్రి కేటీఆర్
సిరిసిల్ల : రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల రూపురేఖ లు మార్చుతానని రాష్ట్ర ఐటీ, పీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గుడ్ల మంజుల, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కొండ అనూష, కత్తెర విజయలక్ష్మితోసహా కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి నివాసంలో శుక్రవారం టీఆర్‌ఎస్ చేరారు. ఈసందర్భంగా మంత్రి మా ట్లాడుతూ సిరిసిల్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. అమృత్ పథకంలో సిరిసిల్లకు స్థానం కల్పించేలా చూస్తామన్నారు. రూ.60 కోట్ల వ్యయంతో రింగు రోడ్డు, మరో రూ.10 కోట్ల వ్యయంతో ఎయిర్‌టె ల్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. తనకున్న పరిచయాలతో కార్పొరేట్ కంపనీలు ఏర్పాటు ఉపాధి అవకాశాలు పెంచుతామని అన్నారు.
నేతన్నలకు ముఖ్యమంత్రితో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేయిస్తానని వివరించారు. 1500 డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేయిస్తానని తెలిపారు. సిరిసిల్లకు చెందిన గుడ్ల శంకరయ్య, కట్టెకోల లక్ష్మీనారాయణ, మ్యాన శంకర్, చిటికెన కనకయ్య, గుడ్ల శ్రీనివాస్, మ్యాన ప్రసాద్, గెంట్యాల శ్రీనివాస్, గుడ్ల బాలకిషన్, పుల్లూరి ప్రసాద్, ఉప్పుల లక్ష్మారెడ్డి, ఆకునూరి అశోక్, సామల పోశెట్టి, వంగరి దేవదాస్, ఏనుగు క్రిష్ణహరి, ప్రభాకర్‌తోపాటు పాతిక మంది మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ చేరారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, సెస్ వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, టీఆర్‌ఎస్ నాయకులు జిందం చక్రపాణి, కొమిరె సంజీవ్, గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.