ఆగ్రహం.. అనుగ్రహం | thermal power power plant in Damaracherla | Sakshi
Sakshi News home page

ఆగ్రహం.. అనుగ్రహం

Published Sun, Jan 18 2015 5:13 AM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

thermal power power plant in Damaracherla

దామరచర్ల : రాష్ట్ర ప్రభుత్వం దామరచర్ల మండలంలో నిర్మించతలపెట్టిన థర్మల్ విద్యుత్ పవర్‌ప్లాంట్ నిర్మాణానికి సేకరించిన అటవీ భూమిని అటవీయేతర భూమిగా మార్చేందుకు శనివారం చేపట్టిన గ్రామసభల్లో తొలుత ఆగ్రహించిన ప్రజలు ఆ తర్వాత అనుగ్రహించారు. 7,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల పవర్ ప్లాంట్ నిర్మాణానికి గాను మండలంలోని ముదిమాణిక్యం, వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెం, నర్సాపురం, కల్లెపల్లి, తిమ్మాపురం, కొండ్రపోల్, కేజేరెడ్డి కాలనీ, వాచ్యాతండా, బాలాజీనగర్ గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 10,500 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమిని ప్రభుత్వం సేకరించింది. ఈ భూమిని అటవీయేతర భూమిగా మార్చేందుకు గ్రామ పంచాయతీల తీర్మానం కోసం గ్రామసభలు నిర్వహించారు.
 
 ఐదు గ్రామాల్లో ఆగ్రహం..
 అధికారులు గ్రామసభలు నిర్వహించేందుకు తమ గ్రామాలకు వస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు పెద్దఎత్తున పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తాళ్లవీరప్పగూడెం, నర్సాపురం, కల్లెపల్లి, బాలాజీనగర్, ముదిమాణిక్యం, కేజేరెడ్డి కాలనీ గ్రామాల్లో తొలుత అగ్రహం వ్యక్తం చేసి గ్రామసభలను బహిష్కరిం చారు.ఉన్న ఫలంగా తాముసాగు చేసుకున్న భూములను ప్రభుత్వం ఎలాంటి హామీలు లేకుండా లాగేసుకుంటే ఉపాధి కోల్పోయి మా కుటుంబాలు వీధిన పడతాయని, గ్రామ పంచాయతీ తీర్మానించవద్దని, ఎవరు కూడా పంచాయతీ ఆవరణలో అడుగుపెట్టవద్దని హెచ్చరించారు. దీంతో తాళ్లవీరప్పగూడెం, కల్లెపల్లి గ్రామాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కల్లెపల్లి గ్రామంలో రెండు వర్గాలుగా ఏర్పడి అనుకూలంగా, వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తోపులాట వరకు పరిస్థితి రావడంతో సీఐ జోక్యం చేసుకొని అడ్డుకున్నారు. బాలాజీనగర్‌లో గ్రామసభ తీర్మానానికి ఎవరూ అంగీకరించలేదు. గాంధీనగ రం గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. కేజేరెడ్డి కాలనీలో బహిష్కరించారు. ముదిమాణిక్యం గ్రామంలో క్వారీ కార్మికులు భూములు కోల్పోతే ఉపాధి పోతుందని, పరిశ్రమ ఏర్పడితే కాలుష్యంతో పొలాల్లో పంటలు పండకుండా పోతాయని గ్రామసభను అడ్డుకున్నారు. కాగా ముది మాణిక్యం, తాళ్లవీరప్పగూడెం గ్రామ సభలకు జేసీ సత్యనారాయణ హాజరై ప్రజల సందేహాలను నివృత్తి చేయడంతో తీర్మానం ఆమోదించారు. కేజేరెడ్డి కాలనీ, బాలాజీనగర్, కల్లెపల్లి గ్రామాల్లో అధికారులు నచ్చ జెప్పడంలో గ్రామస్తులు చివరికి ఆమోదం తెలిపారు.
 
 నాలుగు గ్రామాల్లో ప్రశాంతంగా..
 వీర్లపాలెం,కొండ్రపోల్, వాచ్యతండా, తిమ్మాపురం గ్రామాల్లో ప్రజలు గ్రామసభలకు హాజరై ప్రశాంత వాతావరణంలో పంచాయతీయ తీర్మానం సంతకాలు చేసి థర్మల్ విద్యుత్ ప్లాంట్ కావాలని కోరారు. భూములు కోల్పోయిన వారికి పరిహారం, ఉ ద్యోగావకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
 
 భారీగా పోలీసుల మోహరింపు..
 గ్రామసభలు నిర్వహించిన 10 గ్రామాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మిర్యాలగూడ, సూర్యాపేట డీఎస్పీలు సందీ ప్ గోనె, బషీర్ ఆధ్వర్యంలో 20 మంది సీఐ లు, 30 మంది ఎస్‌ఐలు, సుమారు 400 మం ది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
 
 గ్రామసభల్లో పాల్గొన్న అధికారులు..
 వీర్లపాలెంలో మిర్యాలగూడ ఆర్డీఓ బి. కిషన్‌రావు, తాళ్లవీరప్పగూడెంలో భువనగిరి ఆర్డీఓ ఎన్.మధుసూదన్, ముదిమాణిక్యంలో ఎస్‌డీసీ ఏఎమ్మార్పీ చంద్రశేఖర్‌రెడ్డి, తిమ్మాపురంలో సూర్యాపేట ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, కల్లెపల్లిలో జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి,  బాలాజీ నగర్‌లో ఏఎమ్మార్పీ ఎస్‌డీసీ సూర్యాపేట ఎ.భాస్కర్‌రావు, నర్సాపురంలో శ్రీనివాసులు,. నల్లగొండ ఎస్‌డీసీ, కేఆర్‌ఆర్‌సీ, కేజేరెడ్డి కాలనీలో దేవరకొండ ఆర్డీఓ జి. రవి, కొండ్రపోల్‌లో నల్లగొండ ఆర్డీఓ ఈ. వెంకటాచారి, వాచ్యతండాలో ఏఎమ్మార్పీ స్పెషల్ కలెక్టర్ పీఏ ప్రభాకర శ్రీనివాస్‌తోపాటు 10 మంది తహసీల్దార్లు పాల్గొన్నారు.
 
 అపోహలకు పోవద్దు-జేసీ
 ప్రజలు ఎవరో చెప్పిన మాటలు విని అపోహలకు పోవద్దని జేసీ సత్యనారాయణ కోరా రు. తాళ్లవీరప్పగూడెం పంచాయతీ కార్యాల యంలో ఆయన మాట్లాడారు. మండలంలో ని ప్రైవేటు పరిశ్రమలతో ప్రభుత్వం నెల కొల్పే పరిశ్రమను పోల్చుకోవద్దని సూచించా రు. బాధితులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందన్నారు.ప్రజామోదం తర్వాతే పనులు చేపడుతామన్నారు.   మండలంలోని పది గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement