జర ‘పది’లం | this year chenge tenth class syllabus | Sakshi
Sakshi News home page

జర ‘పది’లం

Published Thu, May 8 2014 3:03 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM

జర ‘పది’లం - Sakshi

జర ‘పది’లం

- మారిన పదో తరగతి సిలబస్
- పరీక్ష విధానంలోనూ మార్పులు
- నూతన సిలబస్‌పై శిక్షణ ఊసేలేదు
- విద్యార్థులు, ఉపాధ్యాయులకు సవాలే..

 
 ఖమ్మం, న్యూస్‌లైన్ : ఈ ఏడాది పదో తరగతి సిలబస్‌ను పూర్తిగా మార్చేశారు. దీనికి తోడు పరీక్ష విధానాల్లోనూ మార్పులు తీసుకొస్తున్నారు. వీటి ప్రభావం వచ్చే విద్యా సంవత్సరం పదవ తరగతి ఫలితాలపై పడే ప్రమాదం ఉంది. దీంతో విద్యా సంవత్సరం ఆరంభం నుంచే ప్రణాళికతో ఉంటే తప్ప ఆశించిన ఫలితాలు రావని విద్యానిపుణులు అంటున్నారు. అయితే మారిన సిలబస్‌ను బోధించేందుకు ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇవ్వడంపై అధికారులు ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి వచ్చే విద్యాసంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించడం అటు విద్యార్థులకు, ఇటు తమకు సవాలేనని ఉపాధ్యాయులు అంటున్నారు.

పరీక్ష విధానాల్లో మార్పులు..
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా ప్రమాణాలు పెంచాలని, దానికి అనుగుణంగా పరీక్ష విధానాల్లో కూడా మార్పులు తీసుకురావాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు బావించారు. ఇందుకోసం గతంలో 11 పేపర్లు ఉన్న పదో తరగతి పరీక్షలను 9 పేపర్లకు కుదించనున్నారు. ప్రతి పేపర్‌కు 80 మార్కులు రాత పరీక్ష, 20 మార్కులు ఇంటర్నల్ మార్కులు కేటాయించాలని నిర్ణయించారు. గతంలో హిందీకి ఒక పేపర్, మిగిలిన ఐదు సబ్జెక్టులకు రెండు పేపర్‌ల చొప్పున మొత్తం 11 పేపర్లు ఉండేవి.

ఇప్పడు మూడు లాంగ్వేజ్ సబ్జెక్టులకు (తెలుగు, హిందీ, ఇంగ్లిష్) ఒక్కొక్క పేపరు, సైన్స్, సోషల్, మ్యాథ్స్ సబ్జెక్టులకు రెండు పేపర్ల చొప్పున మొత్తం 9 పేపర్లకు కుదించారు. 80 మార్కులకు నిర్వహించే రాత పరీక్షలో 28 మార్కులు, 20 ఇంటర్నల్ మార్కులకు కనీసం 7.. మొత్తం 35 మార్కులు వస్తేనే విద్యార్థి ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారు. దీంతో పాటు గతంలో హిందీలో 21 మార్కుల ఉత్తీర్ణత స్థాయిని 35 మార్కులకు పెంచేందుకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ విధానాన్ని విద్యార్థులకు అలవాటు చేసేందుకు తొమ్మిదో తరగతి పరీక్ష విధానంలోనూ ఈ పద్ధతినే ప్రవేశపెట్టాలని ఎన్‌సీఈఆర్‌టీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
కొత్త సిలబస్‌పై శిక్షణ ఏదీ..?

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిలబస్ మార్చడం అవసరం. అయితే అం దుకు అనుగుణంగా బోధించేలా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సిన విద్యాశాఖ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలే దు. పాతకాలం సబ్జెక్టులు చెప్పడంలో అల వాటు పడిన  తమకు కొత్త సిలబస్ బోధిం చాలంటే తిప్పలు తప్పవని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు.

గతంలో పాఠ్యపుస్తకాలు మారితే తమకు శిక్షణ ఇచ్చి బోధనలో మెళకువలు చెప్పేవారని, ఇప్పుడు పదో తరగతిలో అన్ని సబ్జెక్టులు ఒకేసారి మార్చడం, అందులో కొత్త కొత్త అంశాలను చేర్చడంతో వాటిని ఏలా బోధించాలో తెలియడం లేదని వారు ఆం దో న వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు పరీక్ష విధానంలో మార్పులు, మరోవైపు సిలబస్ మార్పుతో వచ్చే విద్యాసంవత్సరంలో పదో తరగతి బోధన అంత సులువైన విషయం కాదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement