గోడను ఢీకొన్న బైక్‌: ముగ్గురు మృతి | Three youth dies after Bike Hits wall | Sakshi
Sakshi News home page

గోడను ఢీకొన్న బైక్‌: ముగ్గురు మృతి

Published Sun, Nov 26 2017 8:26 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Three youth dies after Bike Hits wall - Sakshi - Sakshi

మేడ్చల్: మేడ్చల్‌ మండలం గుండ్లపోచంపల్లి గ్రామ శివారులోని స్మశానవాటిక వద్ద బైక్ అదుపు తప్పి ప్రహరీ గోడను ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పేట్‌బషీరాబాగ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఒకరు ఎన్.అనిల్ (25), చింటు(23) స్థానికంగా ఉన్న ఐక్లీన్ కంపెనీలో పనిచేస్తున్నారు. మూడో వ్యక్తి శశి రెడ్డి (22) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. వీరు గుండ్లపోచంపల్లిలో అద్దెకు ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు నిజామాబాద్‌కు చెందిన వారు కాగా మరొకరిని భువనగిరికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement