చేయని తప్పునకు అబుదాబిలో జైలు శిక్ష
పోలీసులకు విన్నవించిన మహిళ
మెట్‌పల్లి : చేయని తప్పుకు అబుదాబి జైలులో రెండేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న తన భర్తను విడిపించాలని కోరుట్ల మండలం యూసుఫ్‌న గర్‌కు చెందిన గుగ్గిళ్ల రమాదేవి బుధవారం పోలీసులను అశ్రయించింది. ఆమె కథనం ప్రకారం.. పట్టణంలోని యూసుఫ్‌నగర్‌కు చెందిన గుగిళ్ల నరేష్‌కు అబుదాబిలో ఉండే అతని మిత్రుడు, ఇబ్రహీంపట్నం మండలం డబ్బాకు చెందిన తోకల జాన్ రెండేళ్ల క్రితం విజిట్ వీసా పంపాడు. అబుదాబికి వచ్చేటప్పుడు జాఫర్ అనేవ్యక్తి మందుల ప్యాకెట్ ఇస్తాడని, తీసుకుని రమ్మన్నాడు. అబుదాబి ఎయిర్‌పోర్టులో అక్కడి పోలీసులు ప్యాకెట్‌ను పరిశీలించి మోతాదుకు మించి మత్తు ఉందన్న కారణంతో నరేశ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఉపాధి చూపుతానని పిలిచి తన భర్తను కటకటాల పాల్జేసిన జాన్ స్వగ్రామానికి వచ్చాడని పేర్కొంది. తన భర్తను విడిపించి జాన్‌తోపాటు, జాఫర్‌పై చర్యలు తీసుకోవాలని వేడుకుంది.
‘నా భ ర్తను విడిపించండి’
Published Thu, Mar 17 2016 2:41 AM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM
Advertisement
Advertisement