110 మంది మానసిక వికలాంగులకు బాసట
యోగా, కుట్లు, అల్లికల్లో శిక్షణ
చుక్కా వెంకటేశ్వర్లు సేవానిరతి
నేడు ప్రపంచ బుద్ధిమాంద్యం దినం
జనగామ : అందరిలా నడవలేరు.. ఎదుటివారితో స్పష్టంగా మాట్లాడలేరు.. తమ అవసరాలను తా ము తీర్చుకోలేని దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటారు మానసిక వికలాంగులు. ఇటువంటి వా రికి సాయం చేయూలనే దయూర్ద హృదయం చుక్కా వెంకటేశ్వర్లుది. ‘ప్రార్థించేపెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న’ అంటారు పెద్దలు. దీన్ని అక్షరా లా నిజంచేసి చూపారాయన. చేర్యాలలో ‘మనో చేతన’ మానసిక వికలాంగుల పునరావాస కేంద్రా న్ని నెలకొల్పి బుద్ధిమాంద్యం కలిగిన బాలలకు చేదోడుగా నిలుస్తున్న యువ కెరటంపై ‘నేటి ప్రపం చ బుద్ధి మాంద్యం దినం’ సందర్భంగా కథనమిది.
1998 సంవత్సరానికి ముందువరకు చుక్కా వెంకటేశ్వర్లు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వికలాంగుల సంక్షేమ విభాగంలో స్పెషల్ ఎడ్యుకేటర్ పర్సన్ పనిచేసేవారు. పరిమిత పరిధి కలిగిన ఉద్యోగ జీవితం కంటే.. పది మందికి సాయం చేసి, దీవెనలు పొందే అవకాశాన్ని కల్పించే సమాజ సేవ మేలని భావించేవారు వెంకటేశ్వర్లు. అనుకున్నదే తడవుగా కష్టపడి చదివి సంపాదించిన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం తన స్వస్థలమైన చేర్యాలకు చేరుకొని 1998లో ‘మనో చేతన’ పేరుతో మానసిక వికలాంగుల పునరావాస కేంద్రాన్ని నెలకొల్పారు. మానసిక అనారోగ్యంతో దీనస్థితిలో ఉన్న బాల,బాలికలను చేరదీసి, లాభాపేక్ష లేకుండా ఎంతో ఓపికతో సేవలు అందించారు. అమ్మలా లాలన.. నాన్నలా ప్రేమను పంచారు. ఈ ఏడాది(2016)తో ‘మనో చేతన’ సంస్థ 18వ పడిలోకి విజయవంతంగా అడుగుపెడుతోంది. ప్రస్తుతం 110 మంది మానసిక వికలాంగులు ఇందులో విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. యోగాలోనూ బాలలకు శిక్షణ అందిస్తుండటం గమనార్హం. ఆసక్తి ఉన్నవారికి కుట్లు, అల్లికల్లోనూ శిక్షణ అందిస్తున్నారు. క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు వెంకటేశ్వర్లు. ఈ సేవలకుగానూ రాష్ట్ర, జాతీయ స్థారుు అవార్డులు ఆయనను వరించారుు.
డౌన్ సిండ్రోమ్ లక్షణాలివీ..
బుద్ధిమాంద్యాన్ని ఆంగ్లంలో డౌన్ సిండ్రోమ్ అంటారు. ఈ అనారోగ్య సమస్యను కలిగిన పిల్లలు భౌతికంగా మంగోలియన్ జాతి లక్షణాలను కలిగి ఉంటారు. ప్రతి సంవత్సరం జన్మించే వందలాది మంది శిశువుల్లో ఒక్కరిద్దరే ఇటువంటి సమస్యను కలిగి ఉండే అవకాశాలు ఉన్నారుు. ఇది జన్యు సంబంధమైన అసాధారణ అనారోగ్య పరిస్థితే కానీ వంశపారంపర్యంగా వచ్చేది మాత్రం కాదు. మనోచేతన పునరావాస కేంద్రంలో వారికి యోగా నేర్పిస్తున్నారు. కుట్లు, అల్లికల్లోనూ బాలలకు శిక్షణ ఇప్పిస్తున్నారు.
ఇతరులకు సాయం చేయడంలోనే సంతోషం
మానసిక వికలాంగులకు అండగా ఉండాలనే నా లక్ష్యాన్ని ‘మనోచేతన’ స్థాపించడం ద్వారా నెరవేర్చుకున్నా. తాము ఏం చేస్తున్నామో తమకే తెలియని స్థితిలో ఉన్న బుద్ధిమాంద్యం కలిగిన బాలలకు సాయం చేయడంలో ఉన్న సంతోషం నాకు ఎక్కడా కనిపించలేదు. వారికి మానసిక స్థితిని వృద్ధిపర్చే బాధ్యత మా కేంద్రానిదే. పాటల పోటీలు నిర్వహించడం, యోగా శిక్షణ అందించడం, కుట్లు, అల్లికలు నేర్పడం ద్వారా వారిని చైతన్యపరుస్తున్నాం. భవిష్యత్తులో స్వయం ఉపాధి పొందేందుకు ఇవి వారికి ఎంతో ఉపయోగపడతారుు. - చుక్కా వెంకటేశ్వర్లు, మనోచేతన నిర్వాహకుడు
మానవత్వం చెంతన.. మనోచేతన
Published Mon, Mar 21 2016 3:17 AM | Last Updated on Sun, Sep 3 2017 8:12 PM
Advertisement
Advertisement