ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం తెలంగాణవాదులకు ఆగ్రహం తెప్పించింది. పోలవరం ముంపు ప్రాంతాలుగా పరిగణిస్తూ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్ర కేబినెట్ బుధవారం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణవాదులు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. వీరి చర్యను నిరసిస్తూ గురువారం తెలంగాణ బంద్‌కు టీఆర్‌ఎస్, తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపునివ్వగా జిల్లాలోని అన్ని జేఏసీలు మద్దతు తెలిపాయి.
పెత్తనం కోసం..
ఖమ్మం జిల్లాలోని గిరిజన మండలాలను సీమాంధ్రలో కలిపేలా చేసి వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు మరోసారి తెలంగాణపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి పేర్కొన్నారు. ఈ చర్యను నిరసిస్తూ గురువారం తలపెట్టిన బంద్‌కు తెలంగాణ ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలు బంద్‌లో పాల్గొనాలని విజ్ఞప్తిచేశారు. బంద్‌కు ఉద్యోగ, ఉపాధ్యా య, కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు అశోక్ తెలిపారు.
ఉద్యోగులు గురువారం విధులను బహిష్కరించి ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బంద్‌కు సంపూ ర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆర్టీసీ టీఎంయూ జిల్లా అధ్యక్షుడు కేకే.రావు, టీఎన్‌ఎంయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్ తెలిపారు. కార్మికులు బంద్‌లో పాల్గొంటారని, బస్సులు తిరగవని పేర్కొన్నారు. కాగా, జిల్లాలో 623 బస్సులు ఉండగా గురువారం ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోనున్నాయి. వ్యాపార, వాణిజ్య సుముదాయాలూ బంద్ పాటించే అవకాశం ఉంది.
నేడు తెలంగాణ బంద్
Published Thu, May 29 2014 12:48 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement