‘హమ్మయ్య.. ఈ ఏడాది మరుగుదొడ్ల సమస్యలు తీరతాయి.. ఇకనుంచి ఆరుబయటకు వెళ్లాల్సిన పనిలేదు’ అని విద్యార్థులంతా ఆశపడ్డారు. స్వచ్ఛభారత్- స్వచ్ఛ పాఠశాల పథకం కింద నిధులు మంజూరయ్యాయి. బడి తెరిచే నాటికి ఆ నిధులతో మరుగుదొడ్లు సిద్ధం చేస్తారని భావించారు. కానీ, వారి ఆశ ఇంకా నెరవేరలేదు. ఇప్పటివరకు ఒక్క పాఠశాలలో కూడా నిర్మాణం పూర్తి కాలేదు. ఇవి ఎప్పుడు పూర్తవుతాయో.. ఎప్పుడు తమ కష్టాలు తీరతాయోనని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: స్వచ్ఛభారత్-స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని కేం ద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా గత నెలలో జిల్లాలోని 1,086 పాఠశాలల్లో నిర్మించేం దుకు 1,187 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఒక్కోదాని నిర్మాణానికి రూ.1.25లక్షల చొప్పున రూ.14కోట్ల 83లక్షల 75వేలను కేంద్రం కేటాయించింది. అదేవిధంగా 802 పాఠశాలల్లో 1,196 మరుగుదొడ్లకు మరమ్మత్తులు చేసేందుకు రూ.3.13కోట్లు కేటాయించింది. మొదటి విడతగా జిల్లాకు గత నెల 9న రూ.9కోట్లు విడుదలయ్యాయి. ఈ పనులను జూన్ 15నాటికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. కానీ, ఇప్పటి వరకు ఎక్కడా పూర్తి కాలేదు. శనివారం జిల్లాలో జరిగిన సమావేశంలో టీఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు అధికారి చిరంజీవులు ఈ నెలాఖరులోగా యుద్ధప్రాతిపదికన నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశిం చారు.
27మరుగుదొడ్లకే స్లాబ్‌లు పూర్తి..
జిల్లాలో 1187 నూతనంగా నిర్మించేం దుకు మంజూరైతే నెల రోజుల్లో 760 నిర్మాణాలు ప్రారంభించారు. వాటి లో కేవలం 27మాత్రమే స్లాబ్‌లు పూర్తయ్యాయి. 173 లెంటల్ లెవల్, గోడదశలో ఉన్నాయి. 245 బేస్‌మెం ట్ లెవల్‌లో ఉన్నాయి. 315 మరుగుదొడ్లు పునాది దశలో ఉన్నాయి. 427 ఇంకా నిర్మాణాలే పూర్తిచేయలేదు. అదేవిధంగా 1196 మరుగుదొడ్లకు మరమ్మత్తులు చేసేందుకు నిధులు మంజూరైతే 23మరుగుదొడ్లకే మరమ్మత్తులు పూర్తయ్యాయి. 731 మరుగుదొడ్లకు మరమ్మత్తులు చేసేందుకు పనులు ప్రారంభం అయ్యాయి. 442 మరుగుదొడ్లకు మరమ్మత్తులు ప్రారం భం కాలేదు. నెల రోజుల వ్యవధిలో పనితీరు ఈ విధంగా ఉంటే మరో 15రోజుల్లో నిర్మాణాలు పూర్తి చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది.
నిర్మాణాల్లోనూ రాజకీయాలు..
కేంద్రం ప్రభుత్వం మరుగుదొడ్లను మంజూరు చేస్తూ వీటి నిర్మాణ బాధ్యతను పాఠశాల యాజమాన్య కమిటీ( ఎస్‌ఎంసీ)కి అప్పగించాలని నిర్ణయించారు. గతంలో మరుగుదొడ్ల నిర్మాణానికి చాలా తక్కువగా నిధులు వచ్చేవి. ఈ సారి రూ.1.25లక్షలు కేటాయించడంతో గ్రామాల్లో రాజకీయ నాయకులు రంగంలోకి దిగుతున్నారు. ఎస్‌ఎంసీలలో ఇతర పార్టీల వారు ఉంటే వారితో నిర్మాణాలు చేపట్టవద్దంటూ అధికార పార్టీకి చెందిన నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్‌ఎంసీలను సమన్వయం చేయడంలో లోపం వల్ల కూడా ఆలస్యానికి కారణమవుతున్నాయి.
యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి
యుద్ధప్రాతిపదికన మరుగుదొడ్లు నిర్మించాలి. పనుల్లో నాణ్యత పాటిస్తూ ఈ నెలాఖరులోగా నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. రాజకీయాలకు తావులేకుండా విద్యార్థులకు మేలు చేసేందుకు అందరూ సహకరించాలి. ఎస్‌ఎంసీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిర్మాణాలు పూర్తి చేయాలి. ఎస్‌ఎంసీలు నిర్మాణాలకు ముందుకు రాకపోతే అధికారుల ద్వారా నిర్మించేలా చర్యలు తీసుకుంటాం.
- నాంపల్లి రాజేష్,
టాయ్‌లేట్
Published Thu, Jun 18 2015 6:35 AM | Last Updated on Mon, Oct 8 2018 4:59 PM
Advertisement