సాక్షి, మహబూబ్‌నగర్: పొట్టకూటి కో సం జిల్లావాసులు దుబాయి, బొంబా యి ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితిని రూపుమాపుతామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేసి జిల్లా రైతాంగాన్ని ఆదుకుంటామని స్పష్టం చేశారు. బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌శాఖ మంత్రి డా.సి.లకా్ష్మరెడ్డితో కలిసి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. వీరి వెంట షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఉన్నారు. నవాబ్‌పేట మండలం దేపల్లి గ్రామం వద్ద రైతులతో ప్రకృతి సేద్యంపై సదస్సు నిర్వహించారు. గోవు ఆధారితంగా ప్రకృతి సేద్యం చేస్తున్న పంట చేలను, గింజలను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పోచారం మాట్లాడుతూ... ప్రకృతి సేద్యం పాలమూరు జిల్లా చాలా ఉపయోగకరమన్నారు. జిల్లాకు డ్రిప్, స్పింక్లర్లు ఎంతో అవసరమని, రైతులు ఎన్ని కోరినా ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు. ఇది వరకే జిల్లాలో కొన్ని చోట్ల ప్రకృతి సేద్యం సాగవుతోందని, దీన్ని మరింత విస్తృత పరిచేందుక రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఒక ఆవు ద్వారా 30 ఎకరాల వరకు ప్రకృతి సేద్యం సాగు చేసే వీలుంటుందని మంత్రి పేర్కొన్నారు.
ప్రకృతి సేద్యం వల్లే ఆరోగ్యం: లకా్ష్మరెడ్డి
గోవు ఆధారితంగా చేసే ప్రకృతి సేద్యాన్ని చూస్తే చాలా ఆనందంగా ఉందని విద్యుత్‌శాఖ మంత్రి డా.సి.లకా్ష్మరెడ్డి అన్నారు. పూర్వం కూడా ఇంచుమించు ఇలాంటి సేద్యమే చేసేవారని మంత్రి గుర్తుచేశారు. ప్రకృతి సేద్యం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గితే, భూములు కూడా సారవంతంగా మారుతాయన్నారు. వ్యవసాయశాఖ అధ్వర్యంలో ప్రతీ మండలంలో ఒక చోట మోడల్ కేంద్రాన్ని ఏర్పాటుచేసి రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. పాలమూరు జిల్లా వ్యవసాయరంగంలో కూడా వెనకబడినందున... వ్యవసాయశాఖ జిల్లా పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. సేంద్రీయ ఎరువుల ద్వారా పండించిన పంటను ఆహారంగా తీసుకుంటే వ్యక్తి పౌష్టికంగా ఉంటారని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పేర్కొన్నారు. తన పొలంలో గత కొంత కాలంగా రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా నిషేదించినట్లు తెలిపారు. అలాగే అచ్చంపేటకు చెందిన మహిళారైతు ఊర్మిళ, తెలకపల్లి మండలం కారువంగ గ్రామానికి చెందిన లావణ్య, నవాబ్‌పేట మండలం దేపల్లి గ్రామానికి చెన్నారెడ్డి అనే రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశంలో నాయకులు విఠల్‌రావు ఆర్య, ఇందిర, శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి, రాముగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కరువును పారదోలుతాం
Published Thu, Jan 1 2015 4:29 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement