62 మందిని బలిగొన్న చైన్
ఓదెల : మూడు దశాబ్దాల క్రితం కొలనూర్ రైల్వేస్టేషన్ లెవల్ క్రాసింగ్ గేట్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 62 మంది మృతిచెందారు. ఇక్కడి రైల్వేస్టేషన్‌కు ఇరువైపులా గొలుసులు ఉండడంతో ప్రమాదం జరిగింది. 1982 మార్చి 20వ తేదీన సికింద్రాబాద్ నుంచి ఢీల్లీకి అప్‌లైనులో వెళ్తున్న జయంతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రైవేట్ బస్సును ఢీకొట్టడంతో 62మంది అక్కడిక్కడే మృతిచెందారు.
ప్రయాణికుల్లో ఒక చిన్నారి మృత్యుంజయురాలిగా బయటపడింది. మృతులంతా కొలనూర్, పెగడపల్లి, ఊశన్నపల్లి, రాయపేటకు చెందినవారే. అప్పట్లో ఈసంఘటన దేశంలోనే అతిపెద్ద ప్రమాదంగా నిలిచింది. దీంతో రైల్వే శాఖ అధికారులు లెవల్ క్రాసింగ్ గేట్లను నిర్మించారు. గేట్ల సమీపంలో క్యాబిన్లు నిర్మించి ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రధాన లైన్‌లోని లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద కాపలా సిబ్బందిని నియమించిన అధికారులు సింగిల్ లైన్‌లో మాత్రం విస్మరించారు.
2008లో జమ్మికుంటలో..
జమ్మికుంట : 2008 డిసెంబర్‌లో జమ్మికుంట మండలం మడిపల్లి బైపాస్ రహదారిలోని రైల్వే గేటు వద్ద రైలు ఓ స్కూల్ బస్సును ఢీకొంది. ఈ సంఘటనలో ఓ విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వాహనాలు గేట్‌దాటే ప్రయత్నంలో ట్రాక్‌పై ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇదే సమయంలో వచ్చిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు స్కూల్‌బస్సును వెనుక భాగంలో ఢీకొంది. అప్పటికే బస్సులోంచి విద్యార్థులు దిగిపోగా, ఓ విద్యార్థి కిటికీలో నుంచి ప్రయత్నంలో అద్దాల్లో ఇరుక్కుపోయాడు. రైలు బస్సును ఢీకొనడంతో తీవ్రగాయాలైన విద్యార్థి చనిపోయాడు.
ఈ గొలుసుకు ఓ కథ ఉంది..
Published Fri, Jul 25 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM
Advertisement
Advertisement