రేపు టీఆర్‌ఎస్ సభ
వరంగల్, న్యూస్‌లైన్ : టీఆర్‌ఎస్ బహిరంగ సభాస్థలం మా రింది. సభ నిర్వహణ గురువారమే ఖాయమైనప్పటికీ... ఎన్నికల అధికారుల అభ్యంతరాలతో హన్మకొండ నుంచి మడికొండకు షిఫ్ట్ అరుుంది.
ముందుగా నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించాలని భావించినప్పటికీ... భారీ జనం వస్తారని, వాహనాల రద్దీతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, అంతేకాకుండా ప్రభుత్వ విద్యాసంస్థ ప్రాంగణంలో సభ నిర్వహణ నిబంధనలకు విరుద్ధమని అధికారులు అభ్యంతరం తెలిపారు.
దీంతో నగర శివారు మడికొండలోని టీఎన్జీవోస్ గ్రౌండ్‌లో సభ ఏర్పాటుకు టీఆర్‌ఎస్ నేతలు మంగళవారం సన్నాహాలు మొదలుపెట్టారు. సభా స్థలాన్ని చదును చేసే పనులును ముమ్మరం చేశారు. ఈ బహిరంగ సభకు టీఆ ర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. 17న సాయంత్రం 6 గంటలకు ప్రారంభంకానుండగా... కేసీఆర్ హెలికాప్టర్‌లో రానున్నారు. ఈ మేరకు హన్మకండలోని జేఎస్‌ఎం పాఠశాలలో హెలిపాడ్ ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆయన ఇక్కడకు చేరుకుని సభాస్థలికి వెళ్లనున్నారు.
ఆరూరిపైనే భారం
సభ నిర్వహణ వ్యయం వర్ధన్నపేట నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్‌పైనే వేసినట్లు సమాచారం.తన నియోజకవర్గ పరిధిలో సభ నిర్వహిస్తున్నందున ఎన్నికల్లో ఆయనకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతున్నందున ఈ భారం మోపినట్లు తెలిసింది. హన్మకొండలో సభ జరిగితే ఐదు నియోజకవర్గాలు వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్ పశ్చిమ, తూర్పు, పరకాలపై ప్రభావం చూపేదని... ఇప్పుడు వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్ పశ్చిమ సెగ్మెంట్లకే పరిమితమయ్యే అవకాశం ఉందని ఆ పార్టీకి చెందిన మిగతా అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు.