22న కేసీఆర్ ప్రచారం
వరంగల్, న్యూస్‌లైన్ :సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. మడికొండలో గురువారం భారీ బహిరంగ సభ నిర్వహించగా... మరోసారి ఈ నెల 22వ తేదీన రెండో దశ ప్రచారం చేయనునున్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారి ఒంటరి పోరుకు సిద్ధమైన టీఆర్‌ఎస్ జిల్లాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. జిల్లాలో ఎక్కువ స్థానాలే లక్ష్యంగా ప్రచారం తీవ్రం చేసింది. ఇందులో భాగంగా మరో దఫా ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో సభల నిర్వహణకు రూపకల్పన చేశారు.
గులాబీ బాస్ కేసీఆర్ స్వయంగా పాల్గొనే విధంగా సభలు నిర్వహించనున్నారు. హెలికాప్టర్‌లో నియోజకవర్గాన్ని చుట్టివేయూలని నిర్ణయించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. 22న కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో జిల్లాకు వచ్చి ప్రచారం చేపట్టనున్నట్లు వివరించారు. ఐదు నియోజకవర్గ పరిధిలో నిర్వహించనున్న సభల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన అనంతరం కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లనున్నట్లు రవీందర్ రావు తెలిపారు.