టీఆర్‌ఎస్‌లో చేరిన వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న బాజిరెడ్డి
సాక్షి,మోపాల్: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లలో అమల్జేసిన సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని ఆ పార్టీ నిజామాబాద్‌రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవ ర్ధన్ అన్నారు. శుక్రవారం మండలంలోని కాల్పోల్ మాజీ సర్పంచ్ బర్మల్ టీఆర్‌ఎస్‌లో చేరారు. అనతరం ఆయన మాట్లాడారు. అనంతరం మం డలంలోని బోర్గాం(పి) గ్రామంలో టీఆర్‌ఎస్ పా ర్టీ కార్యాలయాన్ని యువ నాయకులు బాజిరెడ్డి జ గన్ ప్రారంభించారు. మండలంలోని ఖానాపూర్, భాగ్యనగర్ కాలనీలోగల కుల సంఘాల నాయకులు బాజిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
డిచ్‌పల్లి: సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ది పనులు చూసి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ తదితర పార్టీల కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. శుక్రవారం డిచ్‌పల్లి మండల కేంద్రంలోని సాక్షి యూనిట్ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ సభా స్థలాన్ని బాజిరెడ్డి పరిశీలించారు. అనంతరం యానంపల్లి, మెంట్రాజ్‌పల్లి, సాంపల్లి, బర్థిపూర్ గ్రామాలకు చెందిన పలువురు బాజిరెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ లో చేరారు.
సిరికొండ: బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్ధతుగా కొండాపూర్‌లో బాజిరెడ్డి చిన్న కుమారుడు అజయ్, ఎంపీపీ మంజుల ప్రచారం చేశారు.
జక్రాన్‌పల్లి: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని గత నాలుగున్నరేళ్లలో ఎంతో అభివృద్ధి చేశానని, మీకు సేవ చేయడానికి నన్ను మరోసారి ఆశీర్వదించండని టీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఎమ్మెల్సీ వీజీగౌడ్‌తో కలిసి బాజిరెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ధర్పల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని బాజిరెడ్డి తనయుడు జగన్ శుక్రవారం చల్లగరిగె, దుబ్బాక, రేకులపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment