
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెరాస మలేసియా ఎన్నారై విభాగం అధ్యక్షుడు చిరుత చిట్టిబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఉద్యమ సమయం లో పోరాట స్ఫూర్తితో ఆవిర్భవించి 18 వసంతాలు పూర్తిచేసుకున్న టీఆర్‌ఎస్.. పరిపాలనలో తనదైన శైలిలో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. కీలక నిర్ణయాలు తీసుకోవడం, అభివృద్ధి పథకాలు అమ లు పరచడంలో, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తూ దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మారుతి కుర్మ, గుండా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.