చందంపేట: టీఆర్‌ఎస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో జరిగిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులు నిర్మిస్తామని, ఇళ్లు కట్టిస్తామని తండ్రీకొడుకులు బూటకపు మాటలు చెప్పి పూట గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఏ ఒక్క చోట కూడా డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. మాయ మాటలు చెబుతూ ప్రజలను మోసం చేయడమే తప్ప టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడమే ధ్యేయంగా పని చేస్తున్నామని, రానున్న ఎన్నికల్లో ఆయన ప్రధాని కావడం ఖాయమన్నా రు. ఈ కార్యక్రమంలో సీఎల్పీమాజీ నేత జానా రెడ్డి, బాలునాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment