TRS government budget
-
రైతు రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలి : కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 7 మాసాలు గడుస్తున్నా రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి సహాయం చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రైతులకు లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పిన టీఆర్ఎస్.. ఈ అంశంపై ఇప్పటి వరకు స్పందించలేదని మండిపడ్డారు. అసలు రుణమాఫీ ఒకేసారి చేస్తారా, విడతల వారీగా చేస్తారా అనే స్పష్టత ఇవ్వాలన్నారు. రైతు బంధు పథకం పై గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇప్పవరకు కేవలం 50 శాతం రైతులకు మాత్రమే రైతు బంధు చెక్కులు అందాయన్నారు. రైతులు చెల్లించాల్సిన ఏడు శాతం వడ్డిలో ప్రభుత్వం నాలుగు శాతం చెల్లిస్తే మిగతా మూడు శాతం రైతులు చెల్లించి వడ్డీ లేకుండా లక్ష రూపాయల రుణం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. గత రుణం చెల్లిస్తినే కొత్త రుణం ఇస్తామని బ్యాంకులు చెప్పటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, దీనికి చర్యగా ప్రభుత్వం బ్యాంకులు వెంటనే కొత్త రుణాలను జారీ చేసేలా ఆదేశించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బ్యాంకర్స్‌తో మీటింగ్ ఏర్పాటు చేసి మిగతా నాలుగు శాతం కేంద్రం నాబార్డ్ ద్వారా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. -
టీఆర్ఎస్కు 16 సీట్లు వస్తే రాజకీయ సన్యాసం
చందంపేట: టీఆర్ఎస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో జరిగిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులు నిర్మిస్తామని, ఇళ్లు కట్టిస్తామని తండ్రీకొడుకులు బూటకపు మాటలు చెప్పి పూట గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఏ ఒక్క చోట కూడా డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. మాయ మాటలు చెబుతూ ప్రజలను మోసం చేయడమే తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడమే ధ్యేయంగా పని చేస్తున్నామని, రానున్న ఎన్నికల్లో ఆయన ప్రధాని కావడం ఖాయమన్నా రు. ఈ కార్యక్రమంలో సీఎల్పీమాజీ నేత జానా రెడ్డి, బాలునాయక్ పాల్గొన్నారు. -
ఉద్యోగాల భర్తీలో విఫలం
నల్లగొండ టూటౌన్ : తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నిరుద్యోగ యువతను ప్రభుత్వం మోసం చేస్తుందని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నల్లగొండలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా íసీఎం కేసీఆర్ లక్షా 6వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించి నేటికీ 20వేలు కూడా భర్తీ చేయకపోవడం ప్రభుత్వం అసమర్థత అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, వాటిని ఎందుకు భర్తీ చేయలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగమని చెప్పి ఉద్యమ సమయంలో నిరుద్యోగులను వాడుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయకుండా మోసం చేసిందన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ కోచింగ్ సెంటర్లకు లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన అతి కొద్ది ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా కోర్టులోనే నానుతున్నాయన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటికి యుద్ధప్రాతిపదికన నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు, విద్యార్థులు సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పార్టీ తరుపున ఆందోళనలు తీవ్రతరం చేస్తామని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిందే నిధులు, నియామకాలు, నీళ్ల కోసమని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మేడిశెట్టి యాదయ్య, కోరె గోవర్ధన్, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండీ ఫయాజ్, నాయకులు నరేష్‌గౌడ్, గాదరి రమేష్, మాచర్ల దశరథ, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం బలహీనపడుతోంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం క్రమంగా బలహీనపడుతోందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ప్రజల్లో నమ్మకం కోల్పోతోందని పేర్కొన్నారు. అమరుల స్ఫూర్తి యాత్ర కోసం 10 రోజుల క్రితమే అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నా పోలీసులు ఆఖరు నిమిషంలో అరెస్టులకు పాల్పడ్డారన్నారు. అనుమతి కోసం వెళ్తే అరెస్టులు చేస్తారా.. అని నిలదీశారు. ప్రభుత్వం శనివారం 400 మంది జేఏసీ నేతలు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసిందన్నారు. ఆదివారం తన నివాసంలో కోదండరాం మీడియాతో మాట్లాడారు. ‘‘పోలీసుల అక్రమ అరెస్టుల నేపథ్యంలో జేఏసీ సంకల్పం మరింత బలపడింది. ప్రభుత్వ తీరును ప్రతిపక్ష పార్టీలన్నిటికీ వివరిస్తాం. గవర్నర్, రాష్ట్రపతికి కూడా ఇక్కడి పరిస్థితిపై ఫిర్యాదు చేస్తాం. న్యాయపోరాటానికి సైతం సిద్ధంగా ఉన్నాం. అత్యాచారాలు, దొమ్మీల వంటి నేరాలకు వర్తింపజేసే సెక్షన్ 151 కింద జేఏసీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడం అన్యాయం’’అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వెం టనే వాటిని భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక నుంచి కొలువుల కోసం కొట్లాట మొదలవుతుందన్నారు. ఈ నెల 31న కొలువుల కొట్లాట కోసం బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నందున కోదండరాం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియాన్ని పరిశీలించారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన: వీహెచ్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిని సీఎం అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారని, ఇప్పటికైనా ఈ వైఖరి మార్చుకోవాలని మాజీ ఎంపీ వి.హన్మంతరావు అన్నారు. ఆదివారం ఆయన మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి బండ చంద్రారెడ్డితో కలసి వెళ్లి కోదండరాంను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని విమర్శించారు. -
దళితులను దగా చేసిన కేసీఆర్ బడ్జెట్
కామారెడ్డిటౌన్: తెలంగాణలో మొట్టమొదటి టీఆర్ఎస్ ప్రభుత్వ బడ్జెట్ దళితుడిని దగా చేసిందని ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. గురువారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. మేనిఫెస్టో ప్రకారం ఎస్ సబ్‌ప్లాన్ నిధులు కాకుండా, ఐదేళ్లలో రూ. 50 వేల కోట్ల నిధులను దళితుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఇపుడు బడ్జెట్లో అరకొర కేటాయింపులు చేసి మోసగించారని ఆరోపించారు. ఐదేళ్లలో రూ. 50 వేల కోట్ల నిధులను ఖర్చు చేస్తేనే దళితులకు ఆర్థిక సమానత్వం సాధ్యమవుతుందన్నారు. భూ పంపిణీ పేరిట దళితులకు రూ. వెయ్యికోట్లతో భూములు కొనుగోలు చేసి అందిస్తామని కేసీఆర్ గారడీ చేస్తున్నారని విమర్శిం చారు. ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడానికి రూ. 6,500 కోట్ల విలువ గల ప్రభుత్వ భూములను అ మ్ముకోవాలని చూస్తున్నారని అన్నారు. ఇది దొరలకు మేలు కలిగించడానికేనని మండిపడ్డారు. ప్రభుత్వ భూములనే దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెట్రో ప్రాజెక్టు ఎల్అండ్టీ కంపెనీ నుంచి మైహోమ్ కంపెనీకి ఎలా అంటగట్టారో ఇప్పుడు ప్రభుత్వ భూములను సొంత సామాజిక వర్గాలకు అం ట గట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. గ్రామాలకే పరిమితమవుతున్న దళితులకు నగరాలలో ఉన్న ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. నిజాంషుగర్ ఫ్యాక్టరీ అంశంపై మోసం అధికారంలోకి వచ్చాక రెండు నెలలలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని కేసీఆర్‌తోపాటు కేటీఆర్ , కవిత హామీ ఇచ్చి ఐదు నెలలు గడుస్తున్నా ఇప్ప టి వరకు ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. బడ్జెట్లో ఫ్యాక్టరీకి నయా పైసా కూడా కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. ఫ్యాక్టరీని చంద్రబాబునాయుడు గతంలో పెట్టుబడిదారులకు అంటగడితే, కేసీఆర్ కూడా అదే తోవలో నడుస్తున్నారన్నారు. దీనిని స్వాధీనం చేసుకుంటే 10 వేల మందికి ఉపాధి దక్కుతుం దన్నారు. బడ్జెట్లో బీసీలకు కూడా పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం, నాయకులు శ్యామ్యూల్, బా లు, ఫర్జానా, కిష్టయ్య, రమేశ్, సాయిలు, లక్ష్మణ్, శంకర్, యాదగిరి, బోకే లింగం తదితరులున్నారు.