కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను గురువారం ఉదయం టీఆర్ఎస్ ఎంపీలు కలవనున్నారని ఆ పార్టీకి చెందిన ఎంపీ వినోద్ తెలిపారు.
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను గురువారం ఉదయం టీఆర్ఎస్ ఎంపీలు కలవనున్నారని ఆ పార్టీకి చెందిన ఎంపీ వినోద్ తెలిపారు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్ కు ప్రత్యేకాధికారాలు కట్టబెట్టడంపై మంత్రితో చర్చిస్తామని చెప్పారు. ఉమ్మడి రాజధానిలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు అవసరమేలేదని ఆయన అన్నారు. ఈ విషయంలో రాజ్యాంగానికి లోబడి కేంద్రం వ్యవహరిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
పోలవరం ముంపు మండలాల కోసం న్యాయపోరాటం చేస్తామన్నారు. సమగ్ర కుటుంబ సర్వేపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందనడంలో వాస్తవం లేదని వినోద్ కొట్టిపారేశారు.