విభజన చట్టాన్ని అమలు చేయాలి | Should apply enforcement of division law | Sakshi
Sakshi News home page

విభజన చట్టాన్ని అమలు చేయాలి

Published Thu, Nov 13 2014 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

విభజన చట్టాన్ని అమలు చేయాలి

విభజన చట్టాన్ని అమలు చేయాలి

హన్మకొండ : రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేసి.. అధికారుల కేటాయింపు త్వరగా పూర్తి చేయూలని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. హన్మకొండ రాంనగర్‌లోని టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను టీఆర్‌ఎస్ ఎంపీలు కలిసి.. రాష్ట్ర సమస్యలు వివరించామన్నారు.

రాష్ట్ర విభజన చట్టం అమలుకాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించామన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు కేటాయింపు పూర్తి కాకపోవడంతో ఇక్కడ పాలన కుంటుపడిందని అన్నారు. విభజన అనంతరం రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగులుతాయని, దీంతో నేరాలు పెరుగుతాయని భావించారన్నారు. దీనికి భిన్నంగా రెండు రాష్ట్రాల ప్రజలు కలిసి పోతున్నారని, ప్రశాంతంగా ఉంటున్నారన్నారు. హైదరాబాద్‌లో పరిస్థితులు శాంతియుతంగా ఉన్నాయని వివరించి.. గవర్నర్ పెత్తనం లేకుండా చేశామన్నారు. కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించామన్నారు.

పత్తి ధర మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5వేలు పెంచాలని వివరించామన్నారు. తెలంగాణలో పత్తి 17.50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారని, 65 లక్షల బేళ్లు ఉత్పత్తి అవుతుందన్నారు. దేశంలో 1.72 ఎకరాల్లో పత్తి సాగుచేస్తుండగా.. 4 కోట్ల బేళ్లు ఉత్పత్తి అవుతుందని వివరించారు. ఈ పత్తిలో 25 శాతం తెలంగాణలో ఉత్పత్తి అవుతుందని వివరించారు. ఇందులో 3 కోట్ల బేళ్లను దేశ అవసరాలకు వినియోగించుకొంటుండగా, కోటి బేళ్లను విదేశాలకు ఎగుమతి చేసేవారమన్నారు.

రాష్ట్రంలో పండుతున్న పత్తిని రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు పత్తి ఆధారిత పరిశ్రమలైన జన్నింగ్, స్పిన్నింగ్ మిల్లులు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎంపీ ఆజ్మీర సీతారాంనాయక్, పార్టీ జిల్లా ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, నాయకులు గుడిమళ్ల రవికుమార్, బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, ఎల్లావుల లలితాయాదవ్, కె.వాసుదేవరెడ్డి, జోరిక రమేష్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement