అభివృద్ధిని మరిచిన పాలకులు | trs party forgot the development | Sakshi
Sakshi News home page

అభివృద్ధిని మరిచిన పాలకులు

Published Mon, Feb 5 2018 7:06 PM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM

trs party forgot the development - Sakshi

పార్టీలో చేరిన ఐలాపూర్‌ గ్రామస్తులు

లింగంపేట: స్వాతంత్య్ర వచ్చిన తర్వాత దేశంలో పేదల పెన్నిదిగా కాంగ్రెస్‌ పార్టీ అవతరించిందని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమడుగు సురేందర్‌ అన్నారు. ఆదివారం ఐలాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 30 ఏళ్లు పాలించిన టీడీపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో శ్రద్ధ చూపలేదన్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చి తప్పారన్నారు. ఎన్నికల సమయంలో అభివృద్ధి జపం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే అభివృద్ధిపై శ్రద్ధ చూపాలని హితవు పలికారు.


కాంగ్రెస్‌ పార్టీలో 150 మంది చేరిక


మండలంలోని ఐలాపూర్‌ గ్రామానికి చెందిన 150 మంది కాంగ్రెస్‌ పార్టీలో ఆదివారం చేరారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సురేందర్‌ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయని వారికి భరోసా ఇచ్చారు. గ్రామంలోని ఆయా సంఘాలు, పార్టీలకు చెందిన మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు వెంకట్, రాంరెడ్డి, నరహరి, ఖదీర్, మండల పార్టీ అధ్యక్షుడు గుర్రం కిష్టయ్య, రాజు, గోపీగౌడ్, నహీం, ఇమాం, ఫతీయోద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement