20న టీఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్ష ఎన్నికలు | TRS party greater hyderabad elections will be on 20th april says party sorces | Sakshi
Sakshi News home page

20న టీఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్ష ఎన్నికలు

Published Sat, Apr 18 2015 7:46 PM | Last Updated on Sun, Sep 3 2017 12:28 AM

20న టీఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్ష ఎన్నికలు

20న టీఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్ష ఎన్నికలు

సంస్థాగత ఎన్నికల ప్రక్రియ అంతిమ దశకు వచ్చిందని, ఈ నెల 20న గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎన్నికల ఇన్‌చార్జ్ పెద్ది సుదర్శన్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ ఇన్‌చార్జ్ మైనంపల్లి హన్మంతరావు వెల్లడించారు.

తెలంగాణభవన్‌లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ క్రియాశీల, సాధారణ సభ్యత్వం కలిపి రాష్ట్రంలో 55.65 లక్షలు పూర్తయినట్టుగా చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల కమిటీలకు అధ్యక్షులు, అనుబంధసంఘాలకు ఎన్నికలు పూర్తయ్యాయన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షస్థానానికి ఈ నెల 20న ఎన్నికలు జరుగుతాయన్నారు. మంత్రి మహేందర్ రెడ్డి ఎన్నికల పరిశీలకునిగా హాజరవుతారని, మంత్రులు మహమూద్ అలీ, నాయిని నర్సింహ్మారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ సమక్షంలో ఎన్నికలు జరుగుతాయని పెద్ది, మైనంపల్లి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement