టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ నాయకులు | TRS party joining the TDP leaders | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ నాయకులు

Published Sun, Feb 14 2016 12:10 AM | Last Updated on Mon, Aug 13 2018 3:55 PM

టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ నాయకులు - Sakshi

టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ నాయకులు

మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలో చేరిక

వికారాబాద్ రూరల్ : టీడీపీ నాయకులు, మున్సిపల్ వైస్ చైర్మన్ సురేష్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ విజయ్‌కుమార్, కౌన్సిలర్లు అనసూయ, రాజమల్లయ్య, సంగీత, స్వరూప, దమయంతితో సంజీవరావు ఆధ్వర్యంలో మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా  మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం 18 నెలల కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాల వల్లే అందరూ టీఆర్‌ఎస్ వైపు రావడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు దాదాపు కనుమరుగయ్యాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ దశల వారీ గా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. మరో 20 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలో ఉంటుందన్నారు. పార్టీలో చేరిన వారిలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు వెంకట్ యాదవ్, నాయకులు నవీన్, ఆయా మండలాల నాయకులు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్, జెడ్పీటీసీ ముత్తార్ షరీఫ్ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement