గులాబీ పవర్.. | TRS pary power.. | Sakshi
Sakshi News home page

గులాబీ పవర్..

Published Sun, Jul 6 2014 2:46 AM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM

TRS pary power..

సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నిక జిల్లాలో కొత్త రాజకీయాలకు తెరలేపింది. టీఆర్‌ఎస్ పకడ్బందీ వ్యూహంతో కాంగ్రెస్, టీడీపీని దెబ్బకొట్టింది. ఈ రెండు పార్టీల్లోని జెడ్పీటీసీ సభ్యులను తమవైపునకు తిప్పుకుని జెడ్పీ పీఠం కైవసం చేసుకుంది. ఈ ప్రక్రియలో జిల్లాలో కాంగ్రెస్, టీడీపీలు కుదేల య్యాయి. 24 జెడ్పీటీసీ సభ్యులతోపాటు పార్టీ టికెట్ దక్కకపోవడంతో రెబెల్‌గా పోటీ చేసి గెలిచిన తాడ్వాయి సభ్యురాలితో కలిపి కాంగ్రెస్‌కు 25 మంది బలం ఉంది.
 
 మొత్తం జెడ్పీటీసీ సభ్యుల్లో సగం ఉన్నా.. జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికలో దారుణంగా దెబ్బతినడంతో కాంగ్రెస్‌లో నైరాశ్యం నెలకొంది. సాధారణ ఎన్నికల ఫలితాలతో సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు జెడ్పీ ఎన్నిక మరింత ఇబ్బందికరంగా మారింది. జెడ్పీ చైర్‌పర్సన్ పదవి పొన్నాల లక్ష్మయ్య సొంత నియోజకవర్గానికే దక్క డం ఇప్పుడు కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారిం ది. గత ఎన్నికల సమయంలో తన పలుకుబడితో సొంత నియోజకవర్గానికి జెడ్పీ చైర్‌పర్సన్ పదవి వచ్చేలా చేసుకున్న పొన్నాలకు... ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలో అలాగే జరగడం ఇబ్బందికరంగా మారింది. మెజారిటీ జెడ్పీటీసీ సభ్యులు ఉన్నా... జెడ్పీ పీఠాన్ని చేజార్చుకోవడంతో పొన్నాలపై సొంత పార్టీ నేతల విమర్శలు ఇంకా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.
 
 విభేదాలతోనే...
 జిల్లాలో మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ 24, టీఆర్‌ఎస్ 18, టీడీపీ 6, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలిచారు. తాడ్వాయి జెడ్పీటీసీ సభ్యురాలు సైతం కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసినవారే. ఇలా 25 మంది సభ్యులు ఉండడంతో కాంగ్రెస్‌కే జెడ్పీ పీఠం దక్కుతుందని అంతా భావించారు. సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో మొదలైన విభేదాలు ఇప్పుడు జెడ్పీ పీఠం చేజారడానికి కారణమయ్యాయి. కాంగ్రెస్ టిక్కెట్ దక్కపపోవడంతో రెబల్ అభ్యర్థిగా నర్సంపేటలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ క్యాంపు నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని నెక్కొండ జెడ్పీటీసీ సభ్యురాలు బక్కి కవితకు చైర్‌పర్సన్ పదవి ఇవ్వాలని ప్రతిపాదించారు. పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన దుగ్యాల శ్రీనివాసరావు... తన నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీ సభ్యురాలికి చైర్‌పర్సన్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇక్కడే విభేదాలు మొదలయ్యాయి. సొంత జిల్లా కావడంతో పీసీసీ చీఫ్ పొన్నాల జోక్యం చేసుకోకపోవడంతో విభేదాలు తారాస్థారుుకి చేరుకున్నారుు. చివరకు దుగ్యాల శ్రీనివాసరావు తన నియోజకవర్గ పరిధిలోని ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులను కాంగ్రెస్ క్యాంపులో చేరకుండా చేశారు. ఇది టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారింది. మద్దతు కోసం దుగ్యాల శ్రీనివాసరావుతో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి చర్చలు జరిపారు.
 
 దుగ్యాల అంగీకారం తెలపడంతో... టీఆర్‌ఎస్ జెడ్పీ పీఠం కోసం తీవ్రంగా ప్రయత్నించింది. కాంగ్రెస్ క్యాంపులో వైస్ చైర్‌పర్సన్ పదవి విషయంలో వచ్చిన విభేదాలను టీఆర్‌ఎస్ అనుకూలంగా మార్చుకుంది. నెల్లికుదురు జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాంభరత్ కాంగ్రెస్ నుంచి జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ పదవి ఆశించారు. కాంగ్రెస్ రాష్ట్ర స్థాయిలో ఈ పదవి బీజేపీ జెడ్పీటీసీ సభ్యుడికి ఇవ్వాలని నిర్ణయించిందన్న సమాచారంతో శ్రీరాంభరత్ క్యాంప్‌ను వీడారు. ఈయనను టీఆర్‌ఎస్ దగ్గరికి తీసుకుంది.
 
 సాధారణ ఎన్నికల్లో ఓటమితో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్తబ్దుగా ఉండిపోయారు. కాంగ్రెస్ క్యాంపు విషయం లో ఈయన అంటిముట్టనట్లుగానే ఉన్నారు. భూపాలపల్లి సెగ్మెంట్‌తో సంబంధాలు ఉన్న టీఆర్‌ఎస్ నేత కొండా మురళీధర్‌రావు చిట్యాల, శాయంపేట జెడ్పీటీసీ సభ్యులు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చేలా చేశారు. టీడీపీకి చెం దిన ఆరుగురు సభ్యుల మద్దతు తీసుకునే విషయంలోనూ కాంగ్రెస్ నేతల విభేదాలే ఆ పార్టీకి ప్రతికూలంగా మారాయి. ఫలితంగా కాంగ్రెస్‌కు జెడ్పీ పద వి దక్కకపోవడంతోపాటు సొంత పార్టీకి చెందిన నల్ల అండాలు (దేవరుప్పుల), బన్నెపాక గణేష్ (పాలకుర్తి), శ్రీరాంభరత్(నెల్లికుదురు), వంగాల రమాదేవి (శాయంపేట), బాకి లలిత(కొడకండ్ల), కాట్రేవులు సాయిలు (చిట్యాల) టీఆర్‌ఎస్‌కు మద్ద తు ఇచ్చారు.
 
 టీడీపీ ఖాళీ...
 జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఆరు స్థానాలు దక్కించుకుంది. సభ్యులు ప్రమాణస్వీకారం చేసిన మొదటి రోజునే టీడీపీ సభ్యుల సంఖ్య రెండుకు పడిపోయింది. చైర్‌పర్సన్ ఎన్నికలో టీడీపీకి చెందిన అంగోతు కవిత(గీసుగొండ), చెట్టుపల్లి మురళీధర్(నల్లబెల్లి), సుకినె రజిత(దుగ్గొండి), మోటపోతుల శివశంకర్(ఘణపురం)లు జెడ్పీచైర్‌పర్సన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చైర్‌పర్సన్ అభ్యర్థికి మద్దతు తెలిపారు. టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ వైస్ చైర్‌పర్సన్ అయినప్పటికీ... ఈయన ఈ ఎన్నికకు స్వతంత్ర అభ్యర్థిగానే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఈ నలుగురు సభ్యులు టీడీపీకి స్వస్తి పలికినట్లేనని తెలుస్తోంది. టీడీపీకి చెందిన కొత్తగూడ జెడ్పీటీసీ సభ్యురాలు దేశిడి అరుణమ్మ ఎన్నిక కార్యక్రమంలోనే ఉన్నా... ఎవరికీ మద్దతు తెలపలేదు. టీడీపీకి చెందిన రాయపర్తి జెడ్పీటీసీ సభ్యురాలు వంగాల యాకమ్మ ఎన్నికలో పాల్గొనలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement