
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను ఎంపిక చేయలేదని పిటిషనర్ వాదనలు వినిపించారు. అయితే కానిస్టేబుల్స్ నియామక ప్రక్రియ సక్రమంగానే జరిగిందని, ఫలితాల్లో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోలేదని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు న్యాయ స్థానానికి తెలిపింది. అంతా పారదర్శకంగానే నిర్వహించామంటూ ఫలితాల వివరాలను కౌంటర్ ద్వారా కోర్టుకు సమర్పించింది. ఇరు వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి(అక్టోబర్ 29) వాయిదా వేసింది. కాగా కానిస్టేబుల్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ అక్టోబర్ 1న అభ్యర్థులు కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment