సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అందులో కీలకమైన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు సమయం వచ్చింది. నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష నిర్వ హణ, మూల్యాంకనం, రాష్ట్రస్థాయి ర్యాంకుల ప్రకట న, 1:3 మెరిట్ జాబితాల ప్రకటన ప్రక్రియను టీఎస్‌పీఎస్సీ పూర్తి చేసింది. జిల్లాల వారీ స్కూల్ అసి స్టింట్ జాబితాలు జిల్లా కలెక్టర్లకు పంపేందుకు చర్య లు చేపట్టింది.
మరో మూడు రోజుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ), పండిట్, పీఈటీ, స్కూల్ అసిస్టెం ట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) జాబితాలను సోమ, మంగళవారం నాటికి అన్ని జిల్లాలకు పంపేందుకు ఏర్పా ట్లు చేసింది. అనంతరం జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో డీఈవోలు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించాల్సి ఉంది. ఇటీవల డీఈవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వచ్చే వారంలో వెరిఫికేషన్ చేపట్టాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు సూచించారు. నెల కిందటే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై శిక్షణిచ్చారు.
కానీ ఇప్పటికిప్పుడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టడం సాధ్యం కాదని డీఈవోలు తెలిపారు. ప్రస్తుతం బదిలీలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో బిజీగా ఉన్నామని, ఆగస్టులోనే వెరిఫికేషన్ చేస్తామ న్నారు. అనుకున్న షెడ్యూలు ప్రకారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సాధ్యం కాదని తేలడంతో జిల్లాల వారీ జాబితాలను తమ వద్ద ఉంచుకోవడం ఎందుకని, కలెక్టర్లకు పంపిస్తే వారికి సాధ్యమైనప్పుడు వారే వెరిఫికేషన్ చేసుకుంటారని ఆ జాబితాలను జిల్లాలకు పంపేందుకు టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టింది.
జిల్లాల్లో వేర్వేరుగా వెరిఫికేషన్ షెడ్యూల్!
దీంతో స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, పండిట్, పీఈటీ, స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టులకు ఏయే తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారో.. తేదీల వారీగా షెడ్యూళ్లను ఆయా జిల్లాల్లో కలెక్టర్లు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని టీఎస్‌పీఎస్సీ వర్గా లు పేర్కొన్నాయి.
ఆ ప్రక్రియను పూర్తి చేసి తమకు పంపిస్తే ఆ తరువాత 15 రోజుల్లో ఎంపికను పూర్తి చేసే అవకాశం ఉంటుందని తెలిపాయి. ఒక్కో జిల్లా లో ఒక్కో రకంగా వెరిఫికేషన్ షెడ్యూలు ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్లకు ఎలాంటి ఆదేశా లు అందలేదు. దీంతో వెరిఫికేషన్ చేపట్టేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment