
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్)కు ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐపీపీఐ) పురస్కారం లభించినట్లు సంస్థ యాజమాన్యం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. సౌర విద్యుదుత్పత్తి, వ్యవసాయ విద్యుత్ సరఫరాలో యాజమాన్య పద్ధతుల అమలు, ఎల్‌ఈడీ లైట్ల పంపిణీ, పంపిణీ వ్యవస్థలో హెచ్‌వీడీఎస్ పద్ధతి అమలు, పంపిణీ నష్టాల తగ్గింపునకు తీసుకున్న చర్యలకుగాను ఈ పురస్కారం లభించినట్లు పేర్కొంది. ఈ నెల 28న కర్ణాటకలోని బెల్గాంలో జరిగే ఓ కార్యక్రమంలో టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ఈ పురస్కారాన్ని అందుకుంటారని తెలిపింది.