కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రైతు భరోసా యాత్రపై తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రైతు భరోసా యాత్రపై తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ రైతు భరోసా యాత్రలా కాకుండా... కాంగ్రెస్ మేలుకొలుపు యాత్రగా సాగిందని ఆయన శనివారమిక్కడ ఎద్దేవా చేశారు.
అమాయకుడిని తీసుకొచ్చి అవమానపరిచారని తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకే ఆర్థిక సాయం చేశారని ఆయన విమర్శించారు. నాలుగేళ్ల తర్వాత ఆత్మహత్యలు జరిగితేనే తమ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని తుమ్మల అన్నారు. కాగా రాహుల్ ...ఆదిలాబాద్ జిల్లాలో రైతు భరోసా యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే.