నీటి గుంతలో పడి ఇద్దరి మృతి
Published Wed, Aug 23 2017 4:12 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
బోథ్: ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంతలో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. ఈ సంఘటన జిల్లాలోని బోథ్ మండల కేంద్రంలో బుధవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ధర్మేంద్ర(13), సాయి(12)లు ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మృతిచెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మృతదేహాలను వెలికి తీశారు.
Advertisement
Advertisement