చుండూరు తీర్పు రాజ్యాంగ విరుద్ధం: తారకం
సాక్షి, హైదరాబాద్: చుండూరు తీర్పు రాజ్యాంగానికి, చట్టాలకు వ్యతిరేకమని చుండూరు దళితుల న్యాయ పోరాట కమిటీ చైర్మన్ బొజ్జా తారకం అన్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ న్యాయస్థానాలు.. ప్రజలకు జవాబుదారీతనం వహించాలని కోరుతూ హైకోర్టు న్యాయమూర్తులకు సోమవారం విజ్ఞాపన పత్రాలిచ్చేందుకు వెళ్తే ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు ప్రాంగణంలోకి కూడా రానివ్వకుండా గేట్లు మూయించారన్నారు. ప్రజలంటే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ, అహంకార పూరితంగా వ్యవహరించిన న్యాయువుూర్తుల తీరును పోరాట కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. చుండూరు ఘటనలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎంత న్యాయ విరుద్ధంగా ఉందో బయట పడుతుందనే న్యాయమూర్తులు విజ్ఞాపన పత్రాన్ని తీసుకోలేదన్నారు.