ఆకస్మిక తనిఖీలు | Unexpected inspection in government hospital | Sakshi
Sakshi News home page

ఆకస్మిక తనిఖీలు

Published Fri, Aug 28 2015 4:28 AM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM

ఆకస్మిక తనిఖీలు - Sakshi

ఆకస్మిక తనిఖీలు

గ్రామాల బాట పట్టిన మంత్రి, కలెక్టర్
జైనూర్ :
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం అర్ధరాత్రి కలెక్టర్ జగన్మోహన్, ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్‌లు ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులను హడలెత్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. అధ్వానంగా ఉన్న రెండు పాత మంచాలపై చికిత్సపొందుతున్న రోగులను చూసి ఈ పాత మంచాలు ఏమిటి అని వైద్యాధికారులకు ప్రశ్నించారు. వాటిని వెంటనే మార్చాలన్నారు.

కలెక్టర్ వ్యాధుల పరిస్థితి గురించి అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌వో ప్రభాకర్ రెడ్డి, ఎస్పీహెచ్‌వో డాక్టర్ వాణి వైద్యాధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. సిర్పూర్(యూ) మండలం మోతిపటార్‌కు చెందిన బుజ్జిబాయి,  సింధు బాయి బాలాజీలు మలేరియాతో ఆస్పత్రిలో చేరారు. వారి మందులను డీఎంఓ అల్హం రవి పరిశీలించగా మొదటి రోజు ఇవ్వాల్సిన మందులు రెండో రోజు ఇవ్వడంతో ఎవరు ఇలా ఇచ్చారో తెలుసుకోవాలని కలెక్టర్ అధికారికి సూచించారు. కోఆప్షన్ సభ్యులు సుబూర్‌ఖాన్, వైద్యాధికారులు నాగేంద్ర , అరుణ, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement