నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో తాగునీటి సౌకర్యం లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరమ్మతులు చేయాలని ఆస్పత్రి అధికారులు కోరుతున్నా ఇంజినీరింగ్ అధికారులు స్పందించడం లేదు. ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు ఆస్పత్రిలోనే ఉండాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఆదేశించినా ఫలితం లేకుండా పోతోంది. ఎండలు మండిపోతున్న త రుణంలో రోగులు, వారి సహాయకులు గుక్కె డు నీటి కోసం తల్లడిల్లుతున్నారు.
ఏడాదిగా ఇదే పరిస్థితి
మెడికల్ కళాశాల ఏర్పాటు తరువాత జిల్లా ఆస్పత్రిని జనరల్ ఆస్పత్రిగా మారుస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఏడంతస్తుల అధునాతన భవనంలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలను విడుదల చేసింది. కొత్త ఆస్పత్రి కాబట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి పనుల కు అనుమతులు ఇచ్చారు. కానీ ఇక్కడి అధికారులు మాత్రం నామమాత్రపు ప నులు చేసి చేతులు దులుపుకున్నారు. ప్ర స్తుతం ఇక్కడ తాగునీటి సౌకర్యం లేదు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలకు నీటిని అం దించేందుకు 12 నీటి బోరు ఉండాలి.
కానీ, రెండు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా రోగులకు నీటిని అందించే వీలులేకుండా ఉన్నాయి. అన్ని విభాగాల లో నల్లాలను ఏర్పాటు చేశారు. ఆస్పత్రి ప్రారంభ సమయంలో నే కొన్ని చోట్ల నల్లాలు చోరీకి గురయ్యూరుు. పైపులనూ ఎత్తు కెళ్లారు. వాటిని మరమ్మత్తు చేసి వినియోగం లోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీం తో రోగులు బయట నీళ్లు కొనుగోలు చేసుకుంటున్నారు.
సీసీ కెమెరాలు ఎక్కడ?
ఆస్పత్రిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఉన్నా, అధికారులు దృష్టి సారించడం లేదు. ప్రతి అంతస్తులో చాలాన్‌గేటు ఏర్పాటు చేయూలి. ఇది కూడా అ తీగతీ లేదు. 76 ఏసీలు ఉంటే 9 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. వీటిని మరమ్మత్తులు చేయించాలని అధికారులు కోరుతున్నా ఇంజినీరింగ్ విభాగం పట్టించుకోవడ ం లేదు. అత్యవసర విభాగంలో గదులను విస్తరించాల్సి ఉంది. రెండు సింకులు ఏర్పాటు చేయూలి. మొదటి అంతస్తు నుండి ఏడవ అంతస్తు వరకు వివిధ విభాగాలను గుర్తించేందుకు ప్రతి గదికి నంబర్ వేయూలి.
భవనం అప్పగించే ముందు ఇంజినీరింగ్ అధికారులే నంబరింగ్ వేయూలి. పట్టించుకునే నాథు డు లేడు. ప్రవేశమార్గం, అ త్యవసర విభాగం వద్ద ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పేరిట నేమ్‌బోర్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించినా మార్పులేదు. డ్రెరుునేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం తో మార్పులు చేయూలని ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన అనుమతించినా పనులకు మోక్షం లేదు.
నీటిపైపులు, టాయిలెట్ పైపులు పగిలి మురికినీరు ప్రవహిస్తోంది. రూ.12 కోట్ల రూపాయలు మరమ్మత్తుల కోసం ఖర్చు చేస్తున్నామని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు.పనులు మాత్రం జరుగ డం లేదు. ఆపరేషన్ గదులలో ఏసీలు పని చేయడం లేదు. ఆస్పత్రి ముందు భాగంలో గార్డెన్ ఏర్పాటు చేయాలని భవన నిర్మాణంలోనే అధికారులు ప్రణాళికలో చేర్చా రు. ఏడాది గడుస్తున్నా దాని జాడ లేదు.
దవాఖానాలో దాహం
Published Sun, Apr 5 2015 3:47 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM
Advertisement
Advertisement