రికార్డులు మాయం | records And ate | Sakshi
Sakshi News home page

రికార్డులు మాయం

Published Sun, Feb 21 2016 1:19 AM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM

రికార్డులు మాయం - Sakshi

రికార్డులు మాయం

రెండు నెలల క్రితమే దృష్టిసారించిన అధికారులు
ఆరు నెలల కిందటే  రికార్డులు మాయం
వివాదాస్పదంగా డాక్టర్ విశ్వశాంతి తీరు
పద్నాలుగేళ్లుగా ఒకేచోట పోస్టింగ్
పలుమార్లు బదిలీ ఉత్తర్వులొచ్చినా పలుకుబడితో రద్దు చేయించుకున్న వైనం
కలెక్టర్ ఆగ్రహంతో సెలవుపై వెళ్లిన విశ్వశాంతి
సమగ్ర విచారణకు మంత్రి ఈటల ఆదేశం

 
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ హెల్త్ : హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రి నిధులు పక్కదారి పట్టిన అంశం జిల్లాలో చర్చనీయాంశమైంది. జననీ సురక్షా యోజన (జేఎస్‌వై), కుటుంబ నియంత్రణ ప్రోత్సాహక నిధులకు సంబంధించి దాదాపు రూ.70లక్షలకు పైగా సొమ్ము దుర్వినియోగమైందని తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని మూడు రోజుల క్రితం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి రెండు నెలల క్రితమే వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమీక్షంలో హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో నిధుల పక్కదారి అంశం చర్చకు వచ్చింది. దీనిపై విచారణ జరుపాలని వరంగల్ ప్రాంతీయ సంచాలకుడు డాక్టర్ నాగేశ్వర్‌రావును ఆదేశించారు. అప్పట్లో విచారణ ప్రారంభించిన నాగేశ్వర్‌రావు విచారణకు హాజరుకావాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వశాంతికి సమాచారం పంపగా, తనకు ఆరోగ్యం బాగాలేదని తెలియచేస్తూ ఆమె పలుమార్లు విచారణకు గైర్హాజరైనట్లు తెలిసింది. దీంతో అనుమానమొచ్చిన విచారణ అధికారులు హుజూరాబాద్ ఆసుపత్రికి వెళ్లి రికార్డులను వెతికారు. అప్పటికే ఆ రికార్డులన్నీ గల్లంతైనట్లు అక్కడి సిబ్బంది చెప్పడంతో అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. రికార్డులు మాయం కావడం, డాక్టర్ విశ్వశాంతి గైర్హాజరు కావడంతో విచారణ పూర్తిగా మందగించినట్లు తెలిసింది.

అదే సమయంలో ఆస్పత్రి అభివృద్ధిపై దృష్టి సారించిన మంత్రి ఈటల రాజేందర్ మూడు రోజుల క్రితం సమీక్షించగా, నిధుల గల్లంతు, రికార్డుల మాయం వ ంటి అంశాలు చర్చకొచ్చాయి. దీంతో సమగ్ర విచారణకు ఆదేశించడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వాస్తవాలను వెలుగులోకి తెచ్చే పనిలో పడ్డారు.

 విశ్వశాంతి తీరు వివాదాస్పదం
హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్‌గా పనిచేసిన వైద్యురాలు విశ్వశాంతి తీరు మొదటి నుంచి వివాదాస్పదంగా మారిం ది. ఆమె దాదాపు పద్నాలుగు ఏళ్లుగా ఇదే ఆసుపత్రిలో కొనసాగడం విశేషం. మధ్యలో నాలుగుసార్లు బదిలీ ఉత్తర్వులు వచ్చినప్పటికీ తనకున్న రాజకీయ పలుకుబడితో వాటిని రద్దు చేయిం చుకుని మళ్లీ హుజూరాబాద్ ఆసుపత్రిలోనే కొనసాగడం గమనార్హం. అప్పట్లో విశ్వశాంతి బదిలీ అయినప్పటికీ మళ్లీ ఇక్కడే ఎందుకు కొనసాగిస్తున్నారంటూ దళిత సంఘాల నాయకులు ఆందోళనలు చేసిన సంఘటనలు ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బందిపట్ల కఠినంగా వ్యవహరించే విశ్వశాంతి తన పనితీరుపై ఎవరూ మాట్లాడొద్దనే సంకేతాలు పంపుతారనే పేరుంది. కొందరు వైద్యులు తనకు వ్యతిరేకంగా సమాచారం పంపుతున్నారనే అనుమానంతో వారిని ప్రభుత్వానికి సరెండర్ చేయడం అప్పట్లో చర్చనీయాంశమంది. అప్పట్లో విశ్వశాంతి, ఆసుపత్రి వైద్యులకు మధ్య తీవ్రస్తాయిలో విభేదాలు తలెత్తడం, ఆమె తీరును నిరసిస్తూ ఆసుపత్రి వైద్యులు విధులు బహిష్కరించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

నిధుల వినియోగంపై సమీక్ష శూన్యం
విశ్వశాంతి పద్నాలుగు ఏళ్లపాటు పని చేసిన సమయంలో అనేకసార్లు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశమైనప్పటికీ ఆసుపత్రికి వచ్చిన నిధుల జమ, ఖర్చులపై ఏనాడూ పూర్తిస్థాయిలో సమీక్ష జరగలేదని తెలుస్తోంది. ఆయా నిధుల వినియోగంపై సూపరింటెండెంట్ పారదర్శకంగా వ్యవహరించకపోవడం, సమీక్షలు సైతం నామమాత్రానికే పరిమితమైన నేపథ్యంలో నిధుల వినియోగంపై ప్రముఖుల దృష్టి పడలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత మూడేళ్లుగా ఆసుపత్రికి సంబంధించిన నిధుల ఖర్చులపై జరిగిన ఆడిటింగ్‌లోలోనూ దుర్వినియోగమైన అంశాన్ని గుర్తించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిధులు పక్కదారి పడుతున్న విషయం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ రాజకీయంగా ఆమెకున్న పలుకుబడి నేపథ్యంలో చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


 కలెక్టర్ సూచనతో సెలవు...
ఈటల రాజేందర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రిపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా విశ్వశాంతి, ఆసుపత్రి వైద్యులకు నిత్యం భేదాభిప్రాయాలు రావడం, చివరకు వైద్యులు విధుల బహిష్కరించడంపై మంత్రి అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పలు వివాదాల్లో కూరుకుపోవడం, మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో విసిగిపోయిన కలెక్టర్ నీతూప్రసాద్ సెలవుపై వెళ్లాల్సిందిగా విశ్వశాంతిని ఆదేశించినట్లు తెలిసింది. కలెక్టర్ ఆదేశంతో ఇక చేసేదేమీలేక విశ్వశాంతి అనారోగ్యం పేరుతో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు వైద్య ఆరోగ్యశాఖలో చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement