
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వ్యభిచారం
మాజీ ఎంపీ వి.హన్మంతరావు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో రాజకీయ వ్యభిచారం రోజురోజుకూ పెరిగిపోతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హన్మంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి ప్రజాప్రతినిధు లుగా ఎన్నికై స్వప్రయోజనాల కోసం మరో పార్టీలో చేరుతూ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. పార్టీ ఫిరాయింపులపై ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని, ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం ఆయన ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైద్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు.