
'ఆ వ్యాఖ్యలతో మోదీ ఓటమిని అంగీకరించారు'
ఢిల్లీ:ఒపీనియన్ సర్వేలను నమ్మవద్దంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం ముందుగా ఓటమిని అంగీకరించడమేనని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ఎన్నికల మోదీ పాలనకు రెఫరెండమ్ కాదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అనడం కూడా ఓటమికి నిదర్శంగా ఆయన పేర్కొన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేయడం ఓటమిని అంగీకరించంగానే ఆయన అభివర్ణించారు.
వాస్తు దోషమంటూ చార్మినార్ ను కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చేస్తారేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఫాస్ట్ పథకాన్ని ఉపసంహరించున్నట్లుగా ప్రజావ్యతిరేక నిర్ణయాలను కేసీఆర్ వెనక్కి తీసుకోక తప్పదని వీహెచ్ తెలిపారు.