
కలిసి సాగితే విజయం మనదే..
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి సమన్వయంతో ముందుకు సాగితే వచ్చే ఉప ఎన్నికల్లో పార్టీ విజయం తథ్యమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు...
టీఆర్‌ఎస్ అధినేత ముస్లింలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. త్వరలో జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలి. సీఎంకు, మంత్రులకు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించే తీరిక లేదా? వడగళ్ల వానకు నష్టపరిహారంగా రైతులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన విద్యార్థుల కుటుంబాలను పట్టించుకోవడం లేదు.
- ఎన్నికలే లక్ష్యంగా పనిచేయూలి
- గ్రేటర్‌పై కాంగ్రెస్ జెండా ఎగరాలి..
- కాంగ్రెస్ ప్రత్యేక సమావేశాల్లో నేతలు
వరంగల్ లోక్‌సభ ఉపఎన్నిక, గ్రేటర్ వరంగల్ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయూలని.. నాయకులు, కార్యకర్తలు కలిసి వెళ్తే విజయం తథ్యమని కాంగ్రెస్ రాష్ట్రస్థారుు కీలక నేతలు అభిప్రాయపడ్డారు. గురువారం ఒక్క రోజే నాలుగు నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించారు. హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల సమావేశానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పరకాలలోని నిర్వహించిన సమావేశానికి టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్ధన్నపేటలో జరిగిన సమావేశానికి పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి క్రమార్క హాజరై మాట్లాడారు.
వరంగల్ : కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి సమన్వయంతో ముందుకు సాగితే వచ్చే ఉప ఎన్నికల్లో పార్టీ విజయం తథ్యమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్‌లో వరంగల్ పార్లమెంట్, నవంబర్‌లో గ్రేటర్ ఎన్నికలు రానున్నాయని చెప్పారు. సోనియా ఇచ్చిన తెలంగాణలో టీఆర్‌ఎస్ ఏడాది పాలన అధ్వానంగా తయారైందన్నారు. ఉప, గ్రేట ర్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు స్థానిక కమిటీల సూచనల మేరకే టికెట్లు ఇస్తామని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా స్పష్టం చేశారు. రాష్ట్రంలో గవర్నర్ వ్యవహారం రెండు పిల్లుల పంచాయతీని కోతి తీర్చిం దన్న చందంగా ఉందన్నారు. తెలంగాణ కోసం కృషి చేసిన మాజీ ఎంపీ రాజయ్యకు మరో అవకాశం కల్పించాలన్నారు. ఏడాది పాలనలో టీఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరించి, వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సమష్టిగా ముందుకు సాగాలని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మీడియాను సీఎం కేసీఆర్ అణచివేస్తున్నారని, ప్రభుత్వ వ్యతి రేక విధానాలపై ధర్నాలు చేస్తే రౌడీ షీట్లు పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారని మాజీ మంత్రి బస్వరాజు సారయ్య మండిపడ్డారు.టీఆర్‌ఎస్ నేతల ఆదేశాలను పాటిస్తున్న అధికారుల్లారా ఖబడ్ధార్ అం టూ.. వచ్చే ప్రభుత్వం కాంగ్రె స్‌దే అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు నడుం బిగించారని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ అన్నారు. కాంగ్రెస్ పాలనలోనే నగరాభివృద్ధి జరిగిందని మాజీ మేయర్ స్వర్ణ అన్నారు. రాజీవ్ ఆవాస్ యో జనలో కార్పొరేషన్‌కు రూ.70 కోట్లు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.30కోట్లు విడుదల చేయనందు వల్లే పేదల ఇళ్ల నిర్మాణాలు కాలేదన్నారు. సీఎం కేసీఆర్ అహం వల్లే ఉప ఎన్నికలు వచ్చాయ ని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. సాధ్యం కాని హామీలకు ప్రజలు మోసపోయారని మాజీ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. నగర అధ్యక్షుడు విద్యాసాగర్, డీసీసీబీ చైర్మన్ రాఘవరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి హరిరమాదేవి, బండా ప్రకాశ్, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మహమూద్, ఈవీ.శ్రీనివాసరావు, బత్తిని శ్రీనివాస్, చం దుపట్ల ధనరాజ్, పోశాల పద్మ, బిన్ని లక్ష్మణ్, మం డల సమ్మయ్య, వీసం సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, సమావేశం జరుగుతుండగా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.